Ramarao on Duty : రవితేజ కోసం ఆరుగురు డైరెక్టర్లు

మాస్ మహారాజా రవితేజా నుండి తాజా గా వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ సినిమా గా తెరకెక్కుతుంది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత వేణు తొట్టెంపూడి సిల్వర్ స్క్రిన్ పై కనిపించబోతున్నాడు. ఈ సినిమా జులై 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు ప్రమోషన్లు పెద్ద స్పీడ్ గా ఏం జరగలేదు. చిత్ర బృందం కానీ, హీరో హీరోయిన్లు కానీ ప్రెస్ మీట్ లో కనిపించలేదు. ఇంటర్వ్యూలోనూ కనిపించలేదు.

ఇదిలా ఉండగా, ఈ రోజు రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ విడుదల కానుంది. దీని కోసం చిత్ర బృందం ఒక ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ ను చిత్ర బృందం గట్టిగానే ప్లాన్ చేసింది. రవితేజ కోసం ఏకంగా ఆరుగురు దర్శకులను ఆహ్వానించింది. గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి, త్రినాథ రావు నక్కిన, సుధీర్ వర్మ, బాబీ, వంశీ కృష్ణ నాయుడు ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కానున్నారు.

ఇందులో రవితేజతో గోపిచంద్ మలినేని ’క్రాక్‘ ’బలుపు‘ సినిమాలకు దర్శకత్వం వహించాడు. అనిల్ రావిపూడి ’రాజా ది గ్రేట్‘ ’దరువు‘ సినిమాలను తెరకెక్కించాడు. రవితేజ రాబోయే సినిమా ’రావణాసుర‘ కు సుధీర్ వర్మ దర్శకత్వం చేయబోతున్నాడు. బాబీ మెగా154 సినిమా దర్శకుడు. ఈ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. అలాగే రవితేజ పాన్ ఇండియా సినిమా ’టైగర్ నాగేశ్వర రావ్‘ సినిమాను వంశీ కృష్ణ నాయుడు తెరకెక్కిస్తున్నాడు. ఇలా తన సినిమాలకు పని చేసిన ఆరుగురు డైరెక్టర్లను రవితేజ అతిథులుగా పిలుచుకున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు