Aadhi Pinisetty : ’రామ్ తగ్గడం వల్లే పేరొచ్చింది‘

రామ్ పోతినేని హీరోగా ‘ది వారియర్’ చిత్రం శుక్రవారం విడుదలైంది. తొలి రోజు సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా, కొన్ని మాస్ ఏరియాల్లో ఈ మూవీ బాగానే కలెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా విలన్ ఆది పినిశెట్టి పాత్రను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ అభిమానులు జీర్ణించుకోవడానికి కష్టంగా అనిపించినా ఇది నిజం. ఈ తమిళ దర్శకుడు హీరో రామ్ కంటే విలన్ ఆది పినిశెట్టి పై ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టు స్పష్టమవుతుంది.

నిజానికి తెలుగు సినిమాల్లో ఇది రెగ్యులర్ అండ్ పరమ రొటీన్ విలన్ రోల్. కానీ ఆది పినిశెట్టి మేనరిజమ్స్ వల్లే బాగా హైలెట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో హీరో రామ్ కు చెప్పుకోదగ్గ ఎంట్రీ సీన్ లేదు. కానీ, ఆదికి మాత్రం మంచి ఇంట్రో సీన్ ఇచ్చాడు దర్శకుడు. ఆ పాత్ర ఎంట్రీ ఇవ్వడమే దానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఓ ఫైట్ ఉంది. అంతే కాకుండా, ఆదికి ఓ హీరోయిన్ ను కూడా పెట్టాడు. వీటికి తోడు ఫస్ట్ హాఫ్ లో హీరోను చితక్కొట్టే సీన్ కూడా ఒకటి ఉంటుంది. మొత్తంగా తమిళ ప్రేక్షకులు ఆది పాత్రను మరింతగా ఎంజాయ్ చేస్తున్నట్లు వినికిడి.

ఇదిలా ఉండగా, ఆది పాత్ర బాగలేదని ఆది నాన్న, సీనియర్ స్టార్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి గాలి తీసేశారట. ‘ది వారియర్’ లో యాస బాగోలేదు. కొన్ని సీన్స్ లో మాత్రమే పెర్ఫార్మన్స్ బాగుంది, నువ్వు హైలెట్ అయ్యావంటే రామ్ గొప్పదనం అని చెప్పాలి. రామ్ తగ్గడం వల్ల నీ పాత్ర స్థాయి పెరిగింది’ అని రవి రాజా పినిశెట్టి అన్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆదినే చెప్పాడు. రవి రాజా గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్లు సినిమాలను తెరకెక్కించాడు. అలాంటి దర్శకుడికి ఈ విషయాలు వెంటనే అర్ధమైపోతాయి. అందుకే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు