NBK108 : ఆ టైటిల్ వద్దు ?

‘అఖండ’ హిట్ తర్వాత బాలయ్య ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107 వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బాలయ్య. ‘NBK 107’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మాస్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రూపొందుతుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటి కే ఈ చిత్రం నుండి టీజర్ రిలీజ్ అయింది. దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చింది. అక్టోబర్ లేదా డిసెంబర్ లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది అని అంటున్నారు. దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇక దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో మాస్ మూవీ చేయబోతున్నాడు బాలయ్య. స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇక సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి. అయితే, ఈ సమయంలో అనిల్ కు బాలయ్య షాకిచ్చాడట.

విషయంలోకి వెళితే, అనిల్ రావిపూడి ఈ చిత్రానికి ‘బ్రో ఐ డోంట్ కేర్’ అనే టైటిల్ ను పెట్టాలని డిసైడ్ అయ్యాడట. కానీ ఈ టైటిల్ వద్దని బాలయ్య చెప్పినట్టు తెలుస్తోంది. తన అభిమానులను, మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని వారికి రీచ్ అయ్యే టైటిల్ పెట్టాలని బాలయ్య కోరినట్టు సమాచారం. బాలయ్య రిక్వెస్ట్ ను అనిల్ కూడా పాజిటివ్ గా తీసుకుని వేరే టైటిల్ గురించి ఆలోచిస్తున్నారని టాక్. ఇక ‘షైన్ స్క్రీన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు