Sitha Ramam : నాని మిస్ చేసుకున్న సినిమా ?

‘ఓకే బంగారం’ ‘మహానటి’ ‘కనులు కనులను దోచాయంటే’ ‘కురుప్’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నుండి వస్తున్న సినిమా ‘సీతా రామం’. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ఈ టైటిల్ కు క్యాప్షన్. ‘అందాల రాక్షసి’ ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ ‘లై’ ‘పడి పడి లేచే మనసు’ లాంటి సినిమాలను తెరకెక్కించిన హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘వైజయంతీ మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి హీరోగా మొదట దుల్కర్ సల్మాన్ ను అనుకోలేదట దర్శకుడు. ముందుగా ఈ స్టోరీని నానికి వినిపించాడట. కానీ, నాని కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు చేయలేకపోయాడు. దీంతో ఈ కథ కోసం దుల్కర్ సల్మాన్ ను ఒప్పించారట ‘వైజయంతి మూవీస్’. దుల్కర్ ఈ బ్యానర్ లో ఇప్పటికే ‘మహానటి’ సినిమాలో నటించాడు. ఆ చనువుతోనే ఈ ప్రాజెక్టు కోసం దుల్కన్ నిర్మాతలు సంప్రదించారని టాక్. మరి నాని మిస్ చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో ఆగష్ట్ 5న తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు