Nayanathara : పెళ్ళైనా డిమాండ్ తగ్గలేదు !

ఏడేళ్ల ప్రేమాయణాన్ని జూన్ 9 రోజు ముగిస్తూ, ఒక్కటి అయ్యారు నయన్-శివన్.అయితే చాలా మందిలో ఓ ప్రశ్న ‘పెళ్ళయ్యాక నయన్ సినిమాల్లో నటిస్తుందా లేదా?’ అని పెళ్లి అయినంత మాత్రాన హీరోయిన్లు సినిమాలకు దూరమవ్వాలి అని అనుకోరు. కాకపోతే పెళ్ళైన హీరోయిన్లకు డిమాండ్ తగ్గుతుంది అని అంతా అనుకుంటారు. పెద్ద సినిమాల్లో వాళ్లకు ఆఫర్స్ రావు అంటారు. పారితోషికం కూడా దర్శకనిర్మాతలు తగ్గించేస్తారు అంటారు. ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు.

నయన్ విషయంలో కూడా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే పెళ్ళైనప్పటికీ నయన్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆమె బాలీవుడ్లో షారుఖ్ తో కలిసి నటిస్తున్న ‘జవాన్’ సినిమా కోసం ఏకంగా రూ.8 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. అలాగే ఇటీవల నయన్ కు కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు వచ్చాయి. వాటికి కూడా అదే రేటు చెప్పగా, దర్శకనిర్మాతలు హ్యాపీగా అడ్వాన్స్ లు ఇచ్చి వెళ్లిపోయినట్టు చెన్నై మీడియా వర్గాల సమాచారం. నయన్ నటించింది అంటే ఆ సినిమాకు తమిళంలో భారీ బిజినెస్ జరుగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు