Chiranjeevi: అభిమానులకి ఐ ఫీస్ట్

కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ “వేదాళం” సినిమా రీమేక్ ను తెలుగులో మెగాస్టార్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్” సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెల పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది.

తెలుగులో బిల్లా సినిమాతో దర్శకుడిగా మారిన మెహర్, తర్వాత కంత్రీ , శక్తీ, షాడో సినిమాలను చేసారు. కానీ ఈ సినిమాలు ఏవి దర్శకుడిగా మెహర్ ను నిలబెట్టలేకపోయాయి. మెగాస్టార్ రీ ఎంట్రీ తరవాత వరుస ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టారు. కొరటాల శివ, బాబీ , మోహన్ రాజా , వెంకీ కుడుముల లాంటి దర్శకులతో సినిమా అన్నప్పుడు అభిమానులకి పెద్దగా ఏమి అనిపించలేదు కానీ, మెహర్ తో సినిమాను అనౌన్స్ చేయగానే చాలామంది పెదవి విరిచారు.

ఎట్టకేలకు కొరటాల తో చేసిన ఆచార్య విడుదలై భారీ డిజాస్టర్ ను చిరు ఖాతాలో వేసింది. ఆ సినిమా ఫలితం ఇప్పుడు మిగతా దర్శకులపై ఒత్తిడిని తీసుకొస్తుంది అనేది చాలామంది అభిప్రాయం. బాబీ చేస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి బరిలోకి దిగడానికి సిద్దమవుతుంది.
గాడ్ ఫాదర్ సినిమా గురించి సరైన అప్డేట్స్ మాత్రం అధికారికంగా రాలేదు. మెహర్ చేస్తున్న “భోళా శంకర్” షూటింగ్ జరుపుకుంటుంది.
భోళా శంకర్ సినిమా హిట్ అవ్వడం మెగాస్టార్ కెరియర్ కంటే మెహర్ కే ఎక్కువ అవసరం ఉంది. ఏదేమైనా “భోళా శంకర్” సినిమా టీజర్ ను మెగాస్టార్ బర్త్ డే కానుకుగా ఆగష్టు 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు