Chinmayi Sripada: వర్జినిటీపై స్టార్ సింగర్ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా భారీ పాపులారిటీ దక్కించుకున్న చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉంటూ అమ్మాయిలు సమాజంలో ఎదుర్కొనే సమస్యల గురించి తన గళం వినిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే చిన్మయి భారీగా సోషల్ మీడియా ట్రోల్స్ కు కూడా గురవుతుంది. ఈ క్రమంలోనే మొదటి కలయికలో వచ్చే అపోహలపై బోల్డ్ కామెంట్స్ చేస్తూ దుమారం రేపింది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుత స్పీడ్ యుగానికి అర్థమయ్యేలా కాస్త ఘాటు భాషలోనే అమ్మాయిలపై అబ్బాయిలకు ఉన్న అపోహల గురించి చెప్పుకొచ్చింది. “మొదటి కలయిక సమయంలో అమ్మాయిలకు నొప్పి ఉంటుందని, రక్తం వస్తేనే వర్జిన్ అని, టైట్ గా ఉంటేనే వర్జిన్ అని అంటూ ఉంటారు. అవన్నీ కేవలం అపోహలు మాత్రమే. పెళ్ళికొడుకులు ఇలాగే ఊహిస్తారు. కానీ రియాల్టీలో ఇలా ఉండదు. నిజానికి తొలి కలయిక సమయంలో అమ్మాయిలకు మరింత బాధ నొప్పి అంటే అది వైద్య పరంగా పెద్ద సమస్య. వెంటనే చికిత్స తీసుకోవాలి” అని సూచించింది.

అయితే వర్జినిటీ విషయంలో అబ్బాయిల ఆలోచనలు మార్చాలని తాను ఇలా బోల్డ్ గా మాట్లాడానని చెప్పుకొచ్చింది. చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఆమె చెప్పిన విషయాలతో వారు ఏకీభవిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు