Shivani Rajasekhar: రహస్యంగా అతనితో డేటింగ్.. త్వరలో శుభవార్త..!

Shivani Rajasekhar.. ఒకప్పుడు హీరోయిన్స్ సినిమాకే తమ జీవితాన్ని అంకితం చేసి.. మూడు పదులు లేదా నాలుగు పదుల వయసు దాటిన తర్వాత వివాహం చేసుకునే వారు.. అయితే ఈ మధ్యకాలంలో అలా కాదు.. ఏ వయసులో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ వయసులోనే జరగాలని ఆలోచిస్తున్నారు.. ఆందుకే 25 సంవత్సరాల వయసు వస్తే చాలు.. తమకు పెళ్లీడు వచ్చిందని .. ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు.. అందులో భాగంగానే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందినవారు ఇండస్ట్రీలోనే తమకు నచ్చిన వారిని ప్రేమించి వివాహం చేసుకుంటే.. మరి కొంతమంది పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకుంటారు.. అయితే ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు తమ మనసుకు నచ్చిన వారితో డేటింగ్ చేసి.. ఆ తర్వాత వివాహం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు శివాని రాజశేఖర్ కూడా ఒకరు..

యాంగ్రీమ్యాన్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం..

యాంగ్రీ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజశేఖర్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి తెలుగు , తమిళ భాషల్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగారు.. అప్పట్లో చిరంజీవి , వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోలతో పోటీగా సినిమాలు రిలీజ్ చేసి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు . ఇక హీరోగా సరైన కథలను ఎంపిక చేసుకోకపోవడం వల్లే ఆయన క్రేజ్ టాలీవుడ్ లో తగ్గిపోయింది.. ఆ తర్వాత నటి జీవితను ప్రేమించి వివాహం చేసుకున్న వీరికి ఇద్దరు కూతుర్లు పుట్టారు.. ఇద్దరూ కూడా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు.. ఇక రాజశేఖర్ కూతురు శివానీ ప్రస్తుతం సినిమాలలో బిజీ బిజీగా ఉంది .. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

బాయ్ ఫ్రెండ్ తో శివానీ రాజశేఖర్..

అదేమిటంటే ఈమె టాలీవుడ్ లోని ఒక యంగ్ హీరోతో ప్రేమలో పడిందని.. ఇందుకు ప్రధాన కారణం ఆ హీరోతో కలిసి వరుస సినిమాలు చేయడమే అని సమాచారం.. మరి ఎవరా యంగ్ హీరో అనే విషయానికి వస్తే.. ఆయన ఎవరో కాదు రాహుల్ విజయ్.. కోటబొమ్మాలి పిఎస్, విద్య వాసుల అహం వంటి రెండు సినిమాల లో కూడా ఈ జంట కలిసి నటించారు.. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పెళ్లికూతురు గెటప్ లో ఉన్న ఫోటోలను , అలాగే యంగ్ హీరో రాహుల్ విజయ్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. దీనితో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు.. వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోంది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.. అందుకే వరుస సినిమాలలో నటిస్తున్నారు అంటూ ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు..

- Advertisement -

రాహుల్ విజయ్ పై పాజిటివ్స్ స్పందన..

Shivani Rajasekhar: Dating him secretly is good news soon
Shivani Rajasekhar: Dating him secretly is good news soon

దీనికి తోడు శివాని రాజశేఖర్ కూడా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని రాహుల్ విజయ్ గురించి పాజిటివ్ గా స్పందించింది .. రాహుల్ విజయ్ కి అసలు ఇగో ఉండదని.. అతడు తనకు చిన్నప్పటి నుంచి తెలుసు అని ఆమె తెలిపింది.. పైగా విద్యా వాసుల అహం సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది. ఈ నేపథ్యంలోని వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందని.. త్వరలోనే వివాహం చేసుకొని అభిమానులకు శుభవార్త తెలుపుతారని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.. మరి నిజంగానే వివాహం చేసుకుంటారా? లేక ఇది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనా? అన్నది తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు