Bhaje Vaayu Vegam Trailer : 40 లక్షలు రాత్రి తొమ్మిది లోపు… తండ్రికాని తండ్రి కోసం కార్తికేయ పోరాటం

Bhaje Vaayu Vegam Trailer : యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ భజే వాయు వేగం. ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను కొద్దిసేపటి క్రితం ప్రసాద్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ ఆవిష్కరించారు. ట్రైలర్ పూర్తిగా యాక్షన్‌తో నిండిపోయి టైటిల్‌కు తగ్గట్టుగానే ఉంది.

ట్రైలర్ రివ్యూ..

భజే వాయు వేగం ట్రైలర్ ద్వారా కార్తికేయ తన తండ్రి ఆపరేషన్ కోసం లక్షల్లో డబ్బు సంపాదించడానికి ఏం చేశాడు ? ఇంటరెస్ట్ ను క్రియేట్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో అతను ఓ రిస్క్ లో చిక్కుకుంటాడు. ఓవైపు పోలీసులు, మరోవైపు రెండు భయంకరమైన ముఠాలు కార్తికేయ కోసం ఛేజ్ చేయడం క్యూరియాసిటీని పెంచేసింది. కథలో ఎక్కువ భాగం ఒకే రోజులో జరిగేలా కనిపిస్తోంది. ఇలా యాక్షన్, సస్పెన్స్ లాంటి థ్రిల్లింగ్ అంశాలతో పాటు తండ్రి కోసం కార్తికేయ పడే తపనను కూడా చూపించి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి చూసేలా మూవీ ఉంటుందని చెప్పేశారు. అయితే యూత్ ఆశించే రొమాంటిక్ సీన్లు మాత్రం ఈ సినిమాలో ఆశించడం కష్టమే అన్పిస్తోంది ట్రైలర్ చూస్తుంటే. ఏదేమైనా అన్నీ ఎమోషన్స్ తో పాటు కపిల్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లోని ముఖ్యాంశాలలో హైలెట్ గా నిలిచింది.

స్టోరీ ఇదేనా ?

యంగ్ క్రికెటర్ గా రాణిస్తున్న హీరో తండ్రి తీవ్ర అనారోగ్యం బారిన పడతాడు. అయితే ఆయన కోసం హీరో అరేంజ్ చేసిన డబ్బు విలన్ల చేతికి చిక్కుతుంది. ఆ డబ్బు కోసం హీరో చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఆ తరువాత తన డబ్బును వెనక్కి తెచ్చుకోవడానికి హీరో రిస్క్ చేయడం, విలన్లు తన తండ్రి దాకా రావడం, తాను తండ్రి అనుకుంటున్న వ్యక్తి తన తండ్రి కాదని హీరోకి తెలియడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అసలు హీరో ఎవరు? హీరో వెంట ఆ విలన్లు ఎందుకు పడుతున్నారు? రాత్రి 9 గంటల లోపు 40 లక్షలు తేవాలని ఎందుకు టార్గెట్ పెట్టారు వంటి విషయాలను థియేటర్లలో వీక్షించాల్సిందే.

- Advertisement -

Bhaje Vaayu Vegam (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

మరో 5 రోజుల్లో థియేటర్లలోకి..

భజే వాయు వేగంలో కార్తికేయ హీరో కాగా, ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ యువి కాన్సెప్ట్స్ దీనిని నిర్మించింది. ఆడియో ఆల్బమ్‌కి రాధన్‌ స్వరాలు సమకుర్చారు. ఈ చిత్రాన్ని మే 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కార్తికేయ కొత్త స్ట్రాటజీ..

ఆర్ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తికేయ ఆ తరువాత ఆ రేంజ్ హిట్ ను అందుకోలేదు. దీంతో ఇప్పుడు పూర్తిగా స్ట్రాటజీ మార్చి కంప్లీట్ గా యాక్షన్ లోకి దిగాడు. మరి ఈ మూవీతోనైనా కార్తికేయ ఆశించిన హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు