Kiran Rathore : 15 లక్షల మోసం… వీసా ప్రాసెసింగ్ కంపెనీ వల్ల కేన్స్ మిస్సయిన హీరోయిన్

Kiran Rathore : ప్రముఖ నటి కిరణ్ తనను ఓ వీసా కంపెనీ 15 లక్షల మోసం చేసిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. పైగా వీళ్ళ వల్ల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ను కూడా మిస్ అయ్యాను అంటూ ఆవేదనను వ్యక్తం చేసింది. ఇంతకీ కిరణ్ ఎలా పోయింది? అనే వివరాల్లోకి వెళ్తే..

15 లక్షలు మోసపోయా.. .

కిరణ్ తాజాగా చేసిన తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తనను 15 లక్షల రూపాయల మోసం చేశారని సంచలన ఆరోపణ చేశారు. మే 13న జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన సినిమా ప్రదర్శింపబడుతుండడంతో అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యానని ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం తాను తప్ప చిత్రబృందం అంతా అక్కడ ఉన్నారని, కేన్స్‌లో తన సినిమా ప్రదర్శితమైందని, అయితే తాను మాత్రం చూడలేకపోయానని చెప్పుకొచ్చింది. కేన్స్ ఫెస్టివల్‌కు వెళ్లేందుకు ఫ్రాన్స్‌లో వీసా కోసం కూడా ప్రయత్నించినా ఫలితం లేదని వెల్లడించింది. తన పోస్ట్‌లో దీనంతటికి కారణం ఓ వీసా ప్రాసెసింగ్ కంపెనీ అని పేర్కొంది. అలాగే వాళ్ళ వల్ల 15 లక్షలు మోసపోయానని, ఇప్పటికీ తన పాస్‌పోర్టు ఎక్కడ ఉందో తెలియక తీవ్ర వేదనలో ఉన్నానని తెలిపారు కిరణ్. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

కిరణ్ మూవీ ఎంట్రీ..

1981లో జైపూర్‌లో జన్మించిన నటి కిరణ్ వయసు ఇప్పుడు 43 ఏళ్లు. 2001లో విడుదలైన బాలీవుడ్ సినిమాతో తన కళాత్మక ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 2002లో తమిళంలో ప్రముఖ నటుడు విక్రమ్ నటించిన “జెమినీ” చిత్రంతో మంచి ఆదరణను అందుకుంది.

- Advertisement -

Actress Kiran Rathod Opens Up About Getting Fewer Film Opportunities Over The Years - News18

స్టార్ హీరోలతో కిరణ్ సినిమాలు

గ్లోబల్ హీరో కమల్ హాసన్, దివంగత నటుడు కెప్టెన్ విజయకాంత్, ప్రశాంత్, తల అజిత్, విక్రమ్ వంటి ఎందరో ప్రముఖ నటులతో నటించిన కిరణ్ 2009 వరకు అగ్ర నటిగా హవా చాటింది. అయితే ఆ తర్వాత మెల్లగా ఆమెకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.

కిరణ్ చివరి మూవీ..

చివరగా 2016లో విడుదలైన తమిళ చిత్రం “ఇలమై ఊంచల్”లో చిన్న పాత్ర పోషించాడు. ఆ తర్వాత గత ఎనిమిదేళ్లుగా సినిమాల్లో నటించని కిరణ్ తన సోషల్ మీడియా పేజీలలో తన గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు వివాదాల్లో కూరుకుపోతోంది. అలాగే ఆమె బిగ్ బాస్ షోలో కూడా పాల్గొనడం గమనార్హం.

కేన్స్ లో పాల్గొన్న హీరోయిన్లు

మే 13న స్టార్ట్ అయిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా సాగుతోంది. ఇందులో పలువురు బాలీవుడ్ హీరోయిన్లు మెరవగా, ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పలువురు ప్రముఖ బాలీవుడ్ కళాకారులు ఇందులో పాల్గొని ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శోభిత ధూళిపాళ, కియరా అద్వానీ ఈసారి కేన్స్ లో అడుగు పెటారు. అంతేకాదు కాదు ‘మంథన్’, ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ సినిమాలు స్టాండింగ్ ఒవేషన్‌ను పొందాయి.ఇప్పుడు భారతదేశానికి మరో గర్వకారణమైన క్షణం వచ్చింది. భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా కేన్స్ 2024లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు