Hardik Pandya: ఆ హీరోయిన్‌ కు 70 శాతం ఆస్తిని ట్రాన్స్‌ఫర్‌ చేసిన హార్ధిక్‌ పాండ్యా?

Hardik Pandya: టీమిండియా స్టార్ క్రికెటర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గుజరాత్ జట్టు నుంచి ఇటీవల ముంబై జట్టుకు వచ్చాడు హార్దిక్ పాండ్యా. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ యాజమాన్యం… ఆ జట్టుకు కెప్టెన్సీ కూడా చేసింది హార్దిక్ పాండ్యాను..! అయితే ముంబై కెప్టెన్గా అవతారం ఎత్తిన హార్దిక్ పాండ్యా మొదటి నుంచి దారుణంగా విఫలమయ్యాడు. దీంతో పాయింట్స్ టేబుల్ లో ముంబై ఇండియన్స్ చిట్ట చివరన నిలిచింది.

ఇక అది చాలాదన్నట్టు హార్థిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. ఆయన భార్య.. హార్థిక్ పాండ్యాకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైందట. హార్థిక్ పాండ్యా తన భార్య నటాషాకు విడాకులు ఇవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనికి గల కారణం….హార్దిక్ పుట్టినరోజున నటాషా ఎలాంటి పోస్ట్ కానీ, విషెస్ కానీ చెప్పలేదట. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా కూడా కలిసి వెళ్లేవారు. వారికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు.

Have Hardik Pandya and Natasa Stankovic separated

అయితే ఈ మధ్యకాలంలో వీరిద్దరి దగ్గర నుంచి ఎలాంటి ఫోటోలు రాకపోవడంతో ఈ మాటలకు మరింత బలం చేకూరింది. నటాషా, హార్దిక్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి వివాహమై నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే పాండ్యా తన భార్య నటాషాకు విడాకుల ప్రక్రియలో భాగంగా తన ఆస్తిలో 70% వాటాను నటాషాకి ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలుస్తోంది. టీమిండియా స్టార్ ఆటగాడిగా, ఐపీఎల్ తో పాటు ప్రకటన కర్తగా హార్దిక్ పాండ్యా సంపాదన కొన్ని వేల కోట్లలో ఉంటుంది. ఇక హార్దిక్ ఆస్తిలో 70% వాటా అంటే కొన్ని వేల కోట్లలో ఉండొచ్చు.

- Advertisement -

అంత మొత్తాన్ని నిజంగానే భరణం కింద చెల్లించాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య అసలు విభేదాలు ఎందుకు వచ్చాయి…ఎప్పుడు చాలా సంతోషంగా కనిపించే ఈ జంట ఒక్కసారిగా ఇలా విడాకులు ఎందుకు తీసుకుంటున్నారనే వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇక ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు