Shivaji: బిగ్ బాస్ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్న శివాజీ.. 90’s రెమ్యునరేషన్ ఎంతంటే..?

Shivaji: ఒకానొక సమయంలో వరుస సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకున్న హీరో శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కాలక్రమేణా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితమైన శివాజీ.. ఆ తర్వాత కొంతకాలానికి రాజకీయాలలోకి కూడా అడుగుపెట్టారు. అక్కడ తన గొంతు వినిపించి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన మళ్లీ కొద్ది రోజులపాటు ఎక్కడ కనిపించలేదు. ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 లో అవకాశం లభించడంతో హౌస్ లోకి అడుగు పెట్టి తానేంటో నిరూపించుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలో చక్కగా మైండ్ గేమ్ ఆడి ఫైనల్ వరకు చేరుకున్న ఈయన విజేతగా నిలుస్తారని అందరూ భావించారు.

కానీ చివరి వారాలలో ఓటింగ్ శాతం పూర్తిగా తగ్గిపోవడంతో టైటిల్ రేసులో కాస్త వెనుక పడ్డారు. దాంతో మూడవ కంటెస్టెంట్ గా బయటకి వచ్చారు. శివాజీ బయటకు వచ్చిన తర్వాత ఈయన నటించిన వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 90s వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇందులో హీరోగా చేశారు.. ఇకపోతే ఇన్ని రోజులు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారుగా 96 సినిమాలు చేసినా రాని క్రేజ్ ఒక్క ఈ వెబ్ సిరీస్ తో వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సీరీస్ బిగ్ బాస్ కార్యక్రమం పూర్తయిన తర్వాత రిలీజ్ చేయడంతో ఆయనకు వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ టీవీ విన్ ఓటీటీ యాప్ లో ఈ సిరీస్ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా ఈ సీరీస్ కి భారీ స్థాయిలో వ్యూస్ రావడంతో పాటు శివాజీకి అంతకుమించి పేరు కూడా లభించింది. ఇకపోతే ఇంత సూపర్ సక్సెస్ అయిన ఈ వెబ్ సిరీస్ కోసం ఆయన ఎంత తీసుకున్నారు అన్న విషయం మరింత వైరల్ గా మారింది. ఈ సిరీస్ కోసం శివాజీ బిగ్ బాస్ రెమ్యునరేషన్ కంటే రెండింతలు ఎక్కువగా తీసుకున్నట్లు సమాచారం. అంటే ఈ సినిమా కోసం ఏకంగా రూ.70 లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వెబ్ సిరీస్ కోసం ఈ రేంజ్ లో డబ్బు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదని.. ముఖ్యంగా బిగ్ బాస్ తర్వాత చాలా క్రేజ్ వచ్చిందని..అందుకే ఈ రేంజ్ లో పారితోషికం తీసుకున్నారని సమాచారం. బిగ్బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు