మ‌హేష్ దూకుడు సాటెవ్వ‌డు..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. మ‌రో 8 రోజుల్లో స‌ర్కారు వారి పాట‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని గీత గోవిందం ఫేమ్ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రు హ్య‌ట్రిక్ హిట్స్ త‌ర్వాత‌.. ప్రిన్స్ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో తొలి నుంచే భారీగా అంచ‌నాలు ఉన్నాయి. దీనికి తోడు ఈ మూవీ నుంచి క‌ళావ‌తి, పెన్నీ తో పాటు టైటిల్ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

తాజా గా స‌ర్కారు వారి పాట నుంచి రిలీజ్ అయిన ట్రైల‌ర్ కూడా సినీ ల‌వ‌ర్స్ ను ఆక‌ట్టుకుంటుంది. మ‌హేష్ డైలాగ్స్ కు. టైమింగ్ కు, యాక్టింగ్ ఫీదా అయిపోతున్నారు. థ‌మ‌న్ త‌న మార్క్ మ్యూజిక్ తో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాడు. మొత్తంగా స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్ కు మంచి మార్కులే ప‌డ్డాయి.

అంతే కాకుండా ఈ ట్రైల‌ర్ యూట్యూబ్ లో రికార్డుల‌ను కూడా సృష్టిస్తుంది. టాలీవుడ్ లో రిలీజ్ అయిన 24 గంట‌ల్లో అత్య‌ధికంగా వ్యూస్ సాధించిన ట్రైల‌ర్ గా నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు మెగా స్టార్ ఆచార్య పేరిట ఉన్న ఈ రికార్డును స‌ర్కారు వారి పాట 27 మిలియ‌న్ల వ్యూస్ తో బ‌ద్ద‌లు కొట్టింది.

- Advertisement -

అంతే కాకుండా.. రికార్డు స్థాయిలో 1.2 మిలియ‌న్ లైక్స్ ను కూడా సొంతం చేసుకుంది. దీంతో సామి శిఖ‌రం.. సామి త‌లుచుకుంటే.. సాధ్యం కానిది లేద‌ని, బాబులకే బాబు మ‌హేష్ బాబు అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. మ‌హేష్ దూకుడుకు సాటెవ్వ‌రు లేరంటూ.. సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు