టాలీవుడ్ లో సంక్రాంతి అంటే.. సినీ లవర్స్ ఓ పండుగ. స్టార్ హీరోల సినిమాలన్నీ ఈ పండుగ రోజే ప్రేక్షకుల ముందుకు వస్తాయి. అప్పుడు హీరోల ఫ్యాన్స్ మధ్య ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది. సంక్రాంతి బరిలో దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరోనే.. సూపర్ స్టార్ అని ట్యాగ్ ఇచ్చేస్తారు. ప్రతి ఏడాది ఇదే రసవత్తమైన పోటీ ఉంటుంది.
ఈ ఏడాది సంక్రాంతికి కింగ్ నాగర్జున బంగర్రాజు తో పాటు పలు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించలేవు. బాక్సాఫీస్ ముందు బొక్క బోర్ల పడ్డాయి. అయితే ప్రస్తుతం మాత్రం పెద్ద సినిమాల హవా నడుస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ వాయిదా పడుతూ వచ్చిన సినిమాలు.. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా స్టార్ చిరంజీవితో పాటు పలువురు స్టార్ హీరోలు తమ సినిమాల షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంచాలని ప్లాన్స్ వేస్తున్నారు.
2023 సంక్రాంతి సినీ లవర్స్ కు ఫుల్ కిక్కేచ్చే విధంగా ఉండబోతుంది. కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ దక్కనుంది. ఎందుకంటే.. వచ్చే ఏడాది స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలు సంక్రాంతి బరిలో ఉంచడానికి రెడీ అవుతున్నాయి.
తాజాగా అందిని సమాచారం ప్రకారం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు, డార్లింగ్ ప్రభాస్ ఆది పురుష్ సినిమాలు సంక్రాంతి పోటీలో ఉండబోతున్నాయి. దీంతో సంక్రాంతి సమరం రసవత్తం అవడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు.