సర్కారు స్కోరు

సూపర్ స్టార్ మహేష్ బాబు
తెలుగు లో ఎవరు చేయనన్నీ ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ ఏకైక చేసిన హీరో, కేవలం కథ నచ్చితే చాలు డైరెక్టర్ ఏమి చెప్పినా చేయడానికి రెడీగా ఉంటారు. ఒక డైరెక్టర్ కథ చెప్పిన వెంటనే నచ్చింది, నచ్చలేదు అని చెప్పడం ఈయనకు అలవాటు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ “అతడు” సినిమా కథను చెప్పిన వెంటనే మనం చేస్తున్నాం అని భరోసా ఇచ్చారు మహేష్, వాస్తవానికి అప్పటికి త్రివిక్రమ్ దర్శకుడిగా ఒక సినిమాని కూడా చెయ్యలేదు.

మహేష్ ఒకే చెప్పిన వెంటనే , నేను స్రవంతి రవి కిషోర్ గారికి ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చాను అండి, అది చేసాక సినిమా చేద్దాం అన్నాడు త్రివిక్రమ్. దానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమా చేసాక మహేష్ బాబుతో అతడు సినిమా చేసారు. ఒక దర్శకుడిని మహేష్ బాబు ఎంతలా నమ్ముతారు అనడానికి ఇదే నిదర్శనం.

అలానే దర్శకులని నమ్మి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయ్, ఆ సినిమాలు ఫెయిల్ అయ్యాయి కానీ, మహేష్ ఎప్పుడు ఫెయిల్ కాలేదు. మహేష్ నుంచి సినిమా వచ్చి ఇప్పటికి రెండేళ్లు దాటింది.ఇప్పుడు అభిమానులు కళ్ళు కాయలు కాచే వెయిట్ చేస్తున్నా మహేష్ అభిమానులకి “సర్కారు వారి పాట” ట్రైలర్ వాళ్లందరికీ ఒక మాస్ ట్రీట్ లా అనిపించింది. ఎప్పుడో కనిపించిన వింటేజ్ మహేష్ కనిపించారు ఈ సినిమాలో. ఈ ట్రైలర్ ఇప్పటికి ట్రేండింగ్ లో ఉంది.

- Advertisement -

ట్రేండింగ్ లో ఉండటమే కాకుండా 29 నిమిషాల్లో ఫాస్టెస్ట్ 5 మిలియన్స్ వ్యూస్ ను సాధించి ఒక సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ లిస్ట్ ను ఇలా చూసుకుంటే కెజిఫ్ ట్రైలర్ కు 31 నిమిషాల్లో 5 మిలియన్ వ్యూస్, బీస్ట్ సినిమాకి 40 నిమిషాల్లో , భీమ్లా నాయక్ కు 60 నిమిషాల్లో 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ఒకప్పుడు రికార్డ్స్ అంటే, సినిమా ఎన్ని రోజులు ఆడింది అనే దానిపై డిపెండ్ అయి ఉండేది. తరువాత కాలంలో అది ఎంత కలక్షన్స్ సాధించింది అనే దానిపై డిపెండ్ అయి ఉండేది, ఇప్పటికి అదే నడుస్తుంది కూడా, దానికి తోడు ఇప్పుడు ఉన్న జెనరేషన్ లో సోషల్ మీడియా హావ ఎక్కువ ఉంది కాబట్టి, వ్యూస్ , లైక్స్ , షేర్స్ అనేవి కూడా రికార్డ్స్ ఖాతాలోనికి వస్తాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు