టార్గెట్ కుంభ‌స్థ‌ల‌మే..!

టాలీవుడ్ కు హీరోగా క‌నిపించ‌డానికి చాలా మంది వ‌స్తారు. కానీ కొంద‌రే నిల‌బ‌డుతారు. ప్రేక్ష‌కులను నిరాశ ప‌రిస్తే.. స్టార్ కుటుంబాల నుంచి వ‌చ్చిన‌ హీరోలు అయినా.. కాల గ‌ర్భంలో క‌లిసిపోవాల్సిందే. ఈ విష‌యాన్ని ప్రాక్టిక‌ల్ గా ఇప్ప‌టికే చూశాం. అదే విధంగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. ఇండ‌స్ట్రీలో సొంత టాలెంట్ తో పైకి వ‌చ్చిన వారూ ఉన్నారు. ఈ జ‌న‌రేష‌న్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక్క‌రు. ప‌లు సినిమాల్లో సైడ్ రోల్స్ చేసి.. పెళ్లి చూపులు సినిమాతో ఒక్క సారిగా వెలుగు లోకి వ‌చ్చాడు. అర్జున్ రెడ్డితో రౌడీ హీరో ట్యాగ్ ద‌క్కించుకున్నాడు.

మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రౌడీ హీరో.. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వంలో బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే లైగ‌ర్ స్పోర్ట్స్ డ్రామా మూవీని చేశాడు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న లైగ‌ర్ .. పోస్టు ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. ఈ మూవీని అగష్టు 25న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయ‌నున్నారు.

అయితే లైగ‌ర్ నుంచి ఇప్ప‌టికే వ‌చ్చిన పోస్ట‌ర్స్, ఫ‌స్ట్ గ్లింప్స్ విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. దీంతో పాటు బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే, ఇంట‌ర్నేష‌నల్ స్టార్ బాక్సర్ మైక్ టైస‌న్ ఈ మూవీలో క‌నిపించ‌డంతో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా హిట్ అయితే రౌడీ హీరో క్రేజ్ మ‌రింత పెరిగనుంది.

- Advertisement -

అర్జున్ రెడ్డి, గీత గోవిందం హిట్స్ త‌ర్వాత‌.. దేవ‌ర‌కొండ‌.. సినిమాలు అంత హిట్ అందుకోలేదు.. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ లీస్ట్ లోకి ఇంకా వెళ్ల‌లేదు. దీంతో ఇంక ఎంత కాలం న‌క్క‌ల వేట.. కుంభ‌స్థ‌లం కొట్ట‌డ‌మే టార్గెట్ అన్న‌ట్టు అంటూ విజ‌య్.. బాక్సాఫీస్ పై దండ‌యాత్ర చేయ‌డానికి రెడీ గా ఉన్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు