రికార్డ్స్… లైక్స్ మీ

కేజీఎఫ్-2.. గ‌త నెల నుంచి ఎంత ప్ర‌భంజ‌న సృష్టిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన‌వ‌స‌రం లేదు. ఆ భాషా, ఈ భాషా అంటూ సంబంధం లేదు. ఎక్క‌డ చూసినా.. రాకీ భాయ్ పేరే. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ క్రియేష‌న్ కు బాలీవుడ్ కూడా స‌లాం కొట్టేసింది. ఇప్ప‌టికే రూ. 1,000 కోట్ల మార్క్ అందుకున్న కేజీఎఫ్-2.. రికార్డుల ప‌రంప‌ర కొన‌సాగిస్తుంది. కొత్త‌గా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. రాకీ భాయ్ జోష్ మాత్రం త‌గ్గ‌డం లేదు.

కేజీఎఫ్ – 2 అంద‌రినీ అశ్చ‌ర్య‌ప‌రుస్తూ.. హిందీ బెల్ట్ లోనూ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు హిందీ రాష్ట్రాల్లో రూ. 382.33 కోట్లు వ‌సూలు చేసింది. సౌత్ మూవీ నార్త్ లో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన రెండో మూవీగా రికార్డు సృష్టించింది. దీనికి ముందు బాహుబ‌లి క‌న్ క్లూజ‌న్ ఉంది.

కాగ ఇటీవ‌ల రంజాన్ సెలవు టైంలో కూడా హిందీ రాష్ట్రాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు.. రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. బిగ్ బి, అజ‌య్ దేవ‌గ‌న్ వంటి దిగ్గ‌జాలు న‌టించిన ర‌న్ వే 34, టైగ‌ర్ ష్రాఫ్ హీరో పంతీ 2 సినిమాలను రాకీ భాయ్ తొక్కేశాడు. ఈ మూడు రోజుల్లో కేజీఎఫ్-2 రూ. 21 కోట్లు, హీరోపంతీ 2 రూ. 13 కోట్లు, ర‌న్ వే 34 రూ. 14.5 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేశారు.

- Advertisement -

దీంతో ఈ మూవీ రిలీజ్ అయి.. 20 రోజులు అవుత‌న్నా.. రికార్డులు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఫ్యాన్స్… ”రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్.. రాకీ భాయ్ డేంట్ లైక్ రికార్డ్స్.. బ‌ట్ రికార్డ్స్ లైక్స్ రాకీ. రాకీ కాంట్ అవాడ్ రికార్డ్స్” అంటూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేసేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు