సూపర్ పవర్

మన దేశం లో లక్ష మందిలో ఒకరికి సొంత బంగ్లా ఉంది!
1000 మందిలో ఒకరికి సొంత కారు ఉంది!
100 మందిలో ఒకరికి సొంత కంప్యూటర్ ఉంది!
కాని ప్రతి 10 మందిలో ఇద్దరి దగ్గర తూపాకి కానీ కత్తి కానీ ఉంది.
ఒక ఫ్రెండ్ చెప్పాడు.
అతను తన దగ్గరికి కుంగ్-ఫు నేర్చుకోడానికి వచ్చిన కుర్రాడితో చెప్పిన మాట నేను ఎప్పటికి మార్చిపోలేను!
“యుద్ధంలో గెలవడం అంటే శ త్రువుని చంపడం కాదు…”
ఈ వాక్యం తను చెప్తేనే బాగుంటుంది…
అతని పేరు సంజయ్ సాహు.!

ఇది జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ కేరక్టర్ కి మహేష్ బాబు చెప్పే డైలాగ్, ఈ డైలాగ్స్ అప్పట్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ సినిమాలకి గ్యాప్ ఇచ్చినప్పుడు తెలుగులో ఉన్న స్టార్ హీరోస్ ఇద్దరే అందులో ఒకరు మహేష్ బాబు , ఇంకొకరు పవన్ కళ్యాణ్. వీళ్ళద్దరి కాంబినేషన్ లో అప్పట్లో త్రివిక్రమ్ దర్శకుడిగా సినిమా కూడా వస్తుంది అని వార్తలు వచ్చాయి. వాస్తవంగా మాట్లాడితే ఇప్పుడు జరుగుతున్న కొన్ని కాంబినేషన్స్ చూస్తుంటే ఈ కాంబినేషన్ కూడా సెట్ చెయ్యొచ్చు. పైగా ఇద్దరితోనూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరితో పనిచేసిన అనుభవం ఉంది.

ఈ కాంబినేషన్ లో సినిమా చూడాలని ఎంతోమంది అభిమానులకి ఉంది. ఆ కాంబినేషన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ,
అటు పవర్ స్టార్ అభిమానులకి , ఇటు సూపర్ స్టార్ అభిమానులకి కిక్ ఇచ్చే సూపర్ పవర్ఫుల్ టాపిక్ ఒకటి చక్కెర్లు కొడుతుంది. మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట మే 12న రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 7 న జరగనుంది, దీనికి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు అని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ “సర్కారు వారి పాట” సినిమాని నిర్మించారు, ప్రస్తుతం
మైత్రి మూవీ మేకర్స్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో “భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమా చేస్తున్నారు పవర్ స్టార్, ఆ నిర్మాతల కోరిక మేరకు ఈ ప్రీ రిలీజ్ కు పవన్ హాజరు అవుతారు ఏమో చూడాలి.
సూపర్ స్టార్ , పవర్ స్టార్ ను ఒకే ఫ్రేమ్ లో చూస్తే వచ్చే కిక్కే వేరు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు