మెగా టెన్షన్

మెగాస్టార్ చిరంజీవి ఈయన గురించి ప్రస్తావించకుండా సౌత్ ఇండియా సినిమా గురించి మాట్లాడలేము. ఆయన మనకు ఒక పవర్ స్టార్ ను ఇచ్చారు మనం సరిపోలేదు అన్నాం, మనకు మెగా పవర్ స్టార్ ను ఇచ్చారు అయినా సరిపోలేదు అన్నాం, అరడజను పైగా హీరోలను ఇచ్చారు. కానీ ఆ హీరోలంతా అరుదుగా హిట్లను కొడుతున్నారు. భారీగా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడుతున్నారు.

పుష్ప సినిమాని మినహాయిస్తే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు, కొన్ని సినిమాలకు బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు.సినిమా రిలీజ్ అవ్వడం ఊహించిన స్థాయిలో ఆ సినిమా ఆడటం పక్కన పెడితే. ఇంతకు ముందులా ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ అంచనాలు, ఆ పండగ వాతావరం అవన్నీ మిస్ అయ్యాయి. ఒకప్పుడు మెగాస్టార్ సినిమా వస్తుంది అంటే కొన్ని రోజులు ముందు నుంచే సందడి ఉండేది . థియేటర్స్ కటౌట్స్ తో నిండిపోయేవి, టికెట్ లైన్లు కిక్కిరిసిపోయేవి, పూలదండలు, పాలాభిషేకాలు ఇవన్నీ ప్రేక్షకులకు అలవాటు అయిపోయాయి.

కానీ ఈ మధ్య కాలంలో అవన్నీ కొంచెం తగ్గాయి, ఆచార్య సినిమా రిలీజ్ కు ముందు అసలు బజ్ లేదు, యూట్యూబ్ లో సజెస్ట్ వీడియోస్ వచ్చినంతవరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది అని చాలామందికి తెలియలేదు. అసలు చిరంజీవి సినిమాకి ఈ పరిస్థితి ఏంటి అని చాలామందికి అర్ధంకాలేదు.అంచనాలు లేకపోవడం కూడా కొంత మంచిదే అనుకున్న తరుణంలో “ఆచార్య” సినిమా ఇంకా నిరాశపరిచింది.

- Advertisement -

సరే ఇప్పటివరకు ఏదో అయిపోయింది అనుకుంటే నెక్స్ట్ మెగాస్టార్ చేసే లైనప్ కూడా అలానే ఉంది, మెహర్ రమేష్ మెగాఫోన్ పట్టుకుని చాలాకాలం అయింది అతనితో భోళా శంకర్ తీస్తున్నారు ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ సినిమాకి రీమేక్. మోహన్ రాజా తో గాడ్ ఫాదర్ సినిమాను చేస్తున్నారు, ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ “లూసిఫర్” కి రీమేక్. రవీంద్ర బాబీ తో ఒక సినిమా చేస్తున్నారు దానిపై కూడా అంచనాలు అంతంత మాత్రమే. వెంకీ కుడుముల తో ఒక సినిమా ఉండబోతుంది అనేది మనకు తెలిసిన విషయం. వరుసగా బాస్ లైనప్స్ చూస్తుంటే అవి ఏ మేరకు హిట్ అవుతాయో, ఆయన డెసిషన్స్ ఏంటో అని మెగా అభిమానులు ఒక టెన్షన్ లో ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు