Sanjay Leela Bhansali : ఆ స్టార్ హీరోతో గొడవలపై భన్సాలీ క్లారిటీ!

Sanjay Leela Bhansali : బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మంచి జోష్ లో ఉన్నాడు. ఆయన తీసిన గంగుబాయ్ కతీయవాడి థియేటర్లలో మంచి విజయం సాధించగా, రీసెంట్ గా “హీరమండి” అనే వెబ్ సిరీస్ తెరకెక్కించి ఓటిటి లోనూ సత్తా చాటాడు. ఇక హీరామండి కి సంబంధించి పలు ఇంటర్వ్యూ లలో పాల్గొన్న ఎంజాయ్ లీలా భన్సాలీ తన తదుపరి సినిమాల గురించి, అలాగే ఇతర చర్చనీయాంశమైన విషయాల గురించి మాట్లాడారు. ఇదిలా ఉండగా సంజయ్ లీలా భ‌న్సాలీ, కండ‌ల హీరో సల్మాన్ ఖాన్ మధ్య గొడవలున్నాయని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో ద‌ర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ప్ర‌శ్నించ‌గా.. ఈ ప్రచారం గురించి ప్ర‌స్థావించారు. అయితే స‌ల్మాన్ తో త‌న రిలేష‌న్ గురించి భ‌న్సాలీ చెప్పిన విష‌యాలు షాక్ కి గురి చేసాయి.

Sanjay Leela Bhansali clarified on the controversy with Salman Khan

సల్లు భాయ్ తో ఎలాంటి గొడవా లేదు..

ఇక తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో సల్మాన్ ఖాన్ తో విభేదాల గురించి క్లారిటీ ఇచ్చారు సంజయ్ లీలా. భన్సాలీ మాట్లాడుతూ.. తనకు సల్మాన్ ఖాన్ కి మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన సంబంధాలు ఉన్నాయ‌ని, ఎటువంటి ఘర్షణ లేద‌ని ఆ వార్త‌ల్ని పూర్తిగా ఖండించారు. తామిరువురం తరచూ టెలిఫోనిక్ సంభాషణలలో పాల్గొంటామ‌ని, సల్మాన్ తన ఆరోగ్యం గురించి ఆరా తీసేందుకు నిరంత‌రం కాల్ చేస్తుంటారని వెల్లడించారు. అయితే సల్మాన్ – సంజయ్ ‘ఇన్షా అల్లా’ చిత్రం కోసం క‌లిసి ప‌ని చేయాల‌నుకున్నారు. కానీ అది ఆలస్యం అయింది. సల్మాన్‌తో భ‌న్సాలీకి క‌ల‌త‌లు వచ్చాయ‌ని, అందుకే ఆ చిత్రం ప‌ట్టాలెక్క‌లేద‌ని ప్ర‌చారమైంది. కానీ ఆ పుకార్లను ఇప్పుడు ఇంట‌ర్వ్యూలో భ‌న్సాలీ తోసిపుచ్చాడు. సినిమాల‌తో సంబంధం లేకుండా త‌మ మ‌ధ్య మంచి రిలేష‌న్ షిప్ ఉంద‌ని భ‌న్సాలీ తెలిపారు.

- Advertisement -

ఇద్దరూ బిజీ!

ఇక వీరి సినిమాల కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే ఈ ఇద్ద‌రూ ఎవ‌రికి వారు ఫుల్ బిజీ. స‌ల్మాన్ త‌దుప‌రి మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సికంద‌ర్ చిత్రంలో న‌టిస్తున్నారు. దర్శకుడు సంజయ్ లీలా భ‌న్సాలీ మొట్టమొదటి వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’ ని విడుదల చేయగా, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం అవుతోంది. ఇక ఆ తర్వాత రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, అలియా భట్ ల‌తో ‘లవ్ అండ్ వార్’ చిత్రం కోసం త‌దుప‌రి భ‌న్సాలీ ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు. ఇక సంజయ్ లీలా భన్సాలీ గతంలో సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ చిత్రం కోసం ప‌ని చేసారు. ఐశ్వర్యరాయ్ ఇందులో క‌థానాయిక‌గా నటించారు. ఇక లవ్ అండ్ వార్ తర్వాత హీరమండి సీజన్ 2 మొదలు పెడతారని సమాచారం. అలాగే అది పూర్తయ్యాక ఓ టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరోతోనూ సినిమా చేయాలనీ సంజయ్ లీలా భన్సాలీ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు