Guinness Record movie: ఒక్క రోజులోనే సినిమా పూర్తి.. ఆ రికార్డు తెలిస్తే ఫ్యూజ్ అవుట్..!

Guinness Record movie: సాధారణంగా ఒక సినిమా తీయాలంటే మినిమం ఆరు నెలలు లేదా. ఒక ఏడాది సమయం పడుతుందనటంలో సందేహం లేదు. ఇక రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులకైతే దాదాపు మూడు నుంచీ నాలుగు సంవత్సరాలు కూడా సమయం పడుతుంది. కానీ ఇక్కడ ఒక సినిమా మాత్రం కేవలం 24 గంటల్లోపే పూర్తయి.. గిన్నిస్ రికార్డు లోకి ఎక్కింది.. మరి ఆ సినిమా ఏంటి ? ఒక్క రోజులోనే ఎలా కంప్లీట్ చేయగలిగారు? ఎంతమంది ఈ చిత్రానికి పనిచేశారు ? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

తమిళ ఇండస్ట్రీకి ఆ రికార్డ్..

Guinness Record movie: The movie was completed in one day.. If you know that record, fuse out..!
Guinness Record movie: The movie was completed in one day.. If you know that record, fuse out..!

ఇక ఆ సినిమా మరేదో కాదు సుయంవరం… దాదాపు రెండున్నర దశాబ్దాల క్రిందట తమిళంలో వచ్చిన కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఇది.. ఈ చిత్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇందులో 14 మంది హీరోలు, 12 మంది హీరోయిన్లు నటించారు. ముఖ్యంగా వారిలో విజయ్ కుమార్, మంజుల విజయ్ కుమార్ ,సత్యరాజ్ , రోజా, ప్రభు, అబ్బాస్ , కస్తూరి, రంగ, ప్రీతి విజయ్ కుమార్, కుష్బూ, మహేశ్వరి, ప్రభుదేవా, హీరా, వినీత్ , అర్జున్ సర్జ, కార్తిక్ తదితరుల తో పాటు తమిళ చిత్ర పరిశ్రమలోని కొంతమంది కీలక నటీనటులు కూడా ఈ సుయంవరం సినిమాలో భాగమయ్యారు.

గిరిధారి లాల్ నాగ్ పాల్ 14 యేళ్ళ కల..

అలాగే జే. పనీర్, ఏ.ఆర్. రమేష్ , కీయార్, ఇ.రాందాస్ , అర్జున్ లియాఖత్ అలీ ఖాన్, సెల్వ, గురు ధనపాల్, కే సుభాష్, సుందర్ సింగ్ సిరాజ్ , కె.ఎస్. రవికుమార్ , పి. వాసు ఇలా మొత్తం 14 మంది దర్శకులు ఈ సినిమాలో భాగమయ్యారు.. ఇక ఈ చిత్రానికి గిరిధారిలాల్ నాగ్ పాల్ ఈ సినిమాకి కథ అందించడమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించారు.. 1999లో గిరిధారి లాల్ నాగ్ పాల్ ఈ ప్రాజెక్టును తన 14 యేళ్ళ కల అంటూ చెప్పుకుంటూ అనౌన్స్ చేశారు. అలాగే 24 గంటల్లోనే ఈ సినిమాను చిత్రీకరిస్తామని ధీమా వ్యక్తం చేశారు.. ఇక ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ విశ్వనాథుడు కమలహాసన్ కూడా హాజరయ్యారు ..అలా 1999 ఏప్రిల్ 5 మరియు 6 తేదీలలో చెన్నైలోని ఫిలిం స్టూడియోలో చెప్పినట్లుగానే 23 గంటలు 58 నిమిషాల్లో సుయంవరం చిత్రీకరణ పూర్తి అయింది..

- Advertisement -

సినిమా కోసం పనిచేసిన భారీ తారాగణం..

పక్కా ప్లానింగ్ తో మొత్తం స్క్రిప్ట్ ను 14 పార్టులుగా డివైడ్ చేసి.. ఒక్కో వైపు ఒక్కో డైరెక్టర్ కొంతమంది ఆర్టిస్టులతో వేర్వేరు ప్లేసుల్లో సేమ్ టైం లో షూట్ చేశారు.. ఇక ఈ చిత్రం కోసం మొత్తం 19 మంది అసోసియేట్ డైరెక్టర్లు, 45 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, 19 మంది కెమెరా మెన్ లు, తొమ్మిది మంది స్టెడీ క్యామ్ ఆపరేటర్లు, 36 మంది అసిస్టెంట్ కెమెరామెన్లు, 14 మంది హీరోలు, 12 మంది హీరోయిన్ లు, కమెడియన్లు , ఐదుగురు డాన్స్ మాస్టర్లు, 16 మంది అసిస్టెంట్లు 140 మంది కోరస్ డాన్సర్లు , స్టంట్ కోఆర్డినేటర్లు ఈ చిత్రానికి పనిచేశారు.

గిన్నిస్ బుక్ లో స్థానం..

ఇలా ఇంతమంది పక్కా ప్లానింగ్ తో ఈ సినిమాని తెరకెక్కించగా 1999 జూలై 16న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.. అంతేకాదు మేకింగ్ పరంగా చాలా ప్రశంసలు కూడా అందుకుంది.. అత్యధిక తారలను ఎంపిక చేసినందుకు అలాగే అతి తక్కువ సమయంలోనే సినిమా పూర్తి చేసినందుకుగాను సుయంవరం సినిమాని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కించారు ..

తెలుగులో కూడా డబ్బింగ్..

తెలుగులో ఈ సినిమాను పెళ్లంటే ఇదేరా అనే టైటిల్ తో విడుదల చేయగా.. తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు