Sharukh Khan : విజయపరంపరని కంటిన్యూ చేస్తున్న బాద్ షా…

Sharukh Khan : బాలీవుడ్ లో కింగ్ ఖాన్ గా మూడు దశాబ్దాలు గా ఇండస్ట్రీని ఏలుతున్న షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు హిట్ల మీద హిట్లు కొట్టి నెంబర్ వన్ హీరోగా బాలీవుడ్ ని ఏలిన ఈ బాక్స్ ఆఫీస్ బాద్ షా దాదాపు ఎనిమిదేళ్ల పాటు సరైన సినిమా లేక డీలా పడ్డాడు. ఎన్ని మంచి చిత్రాలు చేసినా, ప్రయోగాలు చేసినా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. తన తోటి హీరోలు వరుస బ్లాక్ బస్టర్లు కొడుతూ ఉంటే షారుఖ్ మాత్రం ఓ మోస్తరు సినిమా కూడా అందించలేకపోయాడు. పైగా యంగ్ హీరోలు కూడా ఓ దశలో షారుఖ్ ని మార్కెట్ ని అధిగమించేసారు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ కి “పఠాన్” సినిమా ఊపిరి పోసింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా ఎవరికీ సాధ్యం కానీ రేంజ్ లో 1000 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి ఆశ్చ్యర్యపరిచింది. అంతే కాదు దంగల్ వసూళ్ళని బ్రేక్ చేసి ఇండియా లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా గాలివాటం అని అనుకున్నారు కొందరు. కానీ ఆ తర్వాత మళ్లీ జవాన్ తో షారుఖ్ తన క్రేజ్ ఏంటో చూపించాడు.

Shahrukh Khan is also continuing his successful streak in IPL

షారుఖ్ 2.0

ఇక షారుఖ్ ఖాన్ (Sharukh Khan) లాస్ట్ ఇయర్ పఠాన్ సినిమా తో గ్రేటెస్ట్ కం బ్యాక్ ఇచ్చాడు. అయితే అందరూ అది కం బ్యాక్ ఇచ్చినా, ఆ తర్వాత షారుఖ్ మళ్ళీ అలాంటి సినిమా తీయలేడన్నారు. ఏ సినిమాలు లేని టైం లో బాలీవుడ్ లో అలా ఆడేసిందని అన్నారు. కానీ ఆ తర్వాత “జవాన్” సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా అంతకు మించిన భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు షారుఖ్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమా కలెక్షన్ల ప్రభంజనం సృష్టించి బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 1100 కోట్ల వసూళ్లు అందుకుని మరో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ తన అసలు సిసలు క్రేజ్ చూపించాడని, షారుఖ్ 2.0 గా బాక్స్ ఆఫీస్ కి తన అసలు రూపం చూపించాడని నెటిజన్లు కితాబిచ్చారు. ఆ తర్వాత రాజ్ కుమార్ హిరానీ తో డుంకి అంటూ మరో ప్రయోగాత్మక చిత్రం తీసి హిట్ అందుకున్నాడు. అయితే షారుఖ్ తన విజయ పరంపరని సినిమాలోనే కాకుండా బయట కూడా కంటిన్యూ చేస్తున్నాడు.

- Advertisement -

ఫుల్ జోష్ లో షారుఖ్..

ఇక షారుఖ్ ఖాన్ సినిమాల్లోనే కాకుండా బయట కూడా తన విజయపరంపర ని కంటిన్యూ చేస్తున్నాడు. సినిమాల ద్వారానే కాకుండా షారుఖ్ ఖాన్ కి బయట పలు బిజినెస్ లు ఉన్నాయని తెలిసిందే. అలాగే ఐపీఎల్ క్రికెట్ లో కోల్కథా నైట్ రైడర్స్ కి యజమాని గా ఉన్నాడు. ఇదిలా ఉండగా నిన్న (మే 26) న జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ తో తలపడిన కోల్ కతా టీం ఫైనల్ లో సునాయాసంగా మ్యాచ్ గెలిచి ఐపీఎల్2024 కప్ గెలుచుకుంది. ఇక మ్యాచ్ గెలవగానే గ్రౌండ్ లోకి వచ్చి కెకేఆర్ టీం యజమాని షారుఖ్ ఖాన్ సంబరాలు చేసాడు. ఈ విధంగా తన విజయపరంపరని సినిమాల్లోనే కాకుండా ఐపీఎల్ లో కూడా కొనసాగించాడు. ఇక షారుఖ్ ఖాన్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న షారుఖ్, త్వరలో తన కూతురు సుహానా ఖాన్ ని కూడా సినిమాల్లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు