Samantha Ruth Prabhu : సమంత అందానికి ముగ్దురాలైన స్టార్ హీరోయిన్.

యశోద విజయం తో మంచి జోరు మీదున్న సమంత ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా సినిమాల మీద సినిమాలు చేస్తుంది. నాగచైతన్యతో విడాకుల తరవాత తన ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో శారీరకంగా మానసికంగా కోలుకోవడానికి కొంత సమయం పట్టింది.

ఇక వివరాల్లోకి వెళితే రీసెంట్ గా సమంత ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫోటోషూట్స్ పిక్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యాయి. అప్లోడ్ చేసిన ఒక్కరోజులోనే 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. అంతే కాదు తాను పెట్టిన పోస్టులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా లైక్ కొట్టింది. సమంత పిక్స్ కి ఎంతో ఆకర్షితురాలైనట్టు అక్కడ తెలుస్తుంది. సామ్ తన అందంతో తమన్నాని పూర్తిగా డామినెట్ చేసింది.

ఈ ఇద్దరు వృత్తి పరంగా ఎప్పటికప్పడు కాంపిటేషన్ ఇస్తూ ఎంతో సన్నిహతంగా ఉంటారు. అదీ కాక వీళ్లిద్దరు ఇండస్ట్రీ లో మంచి స్నేహితులు. మానసికంగా సమంత క్రుంగి పోతున్న సమయంలో తమన్నా తోడుగా నిలిచింది. సమంత ఇచ్చిన మోటివేషన్ వల్లే తమన్నా కూడా ఆధ్యాత్మికత కు దగ్గరైంది. ఇటు తమన్నా కూడా భోళా శంకర్ షూటింగ్లో బిజీ గా ఉంది.

- Advertisement -

ఇక సమంత ప్రస్తుతం శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటిస్తుంది. అంతే కాకుండా ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు హడావిడి చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. కొన్ని రోజుల క్రితం శాకుంతలం కోసం ఏకంగా 14 కోట్ల విలువైన బంగారు నగలను ధరించి సెన్సేషన్ సృష్టించింది. ఇక సమంత నటించిన శాకుంతలం ఏప్రిల్ 14 న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల అవబోతుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు