Saamajavaragamana: శ్రీ విష్ణు ఈ సారైనా చెప్పిన టైమ్ కి వస్తాడా?

టాలెంటెడ్ నటుడు శ్రీ విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం “సామజవరగమన”. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్ లో అనిల్ సుంకర, రాజేష్ దండ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా, రామ్ అబ్బరాజు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆ మధ్య ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమాలో హీరో తనకు ఎవరు లవ్ ప్రపోజ్ చేసినా వాళ్ళతో రాఖీ కట్టించుకుంటాడు. అసలెందుకు అలా చేస్తాడు. ఈ హీరోకి ఉన్న ప్రాబ్లమ్ నేటి అన్నదే సినిమా కాన్సెప్ట్.

గత నెల మే 18నే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు సినిమాల పోటీ వలన రిలీజ్ డేట్ మార్చుకుంటూ వస్తుంది. తాజాగా చిత్ర యూనిట్ మరో రిలీజ్ డేట్ ని ప్రకటించింది. ఈ నెల అనగా జూన్29 న “సామజవరగమన” చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పటికే రెండు మూడుసార్లు రిలీజ్ డేట్ చేంజ్ చేసిన చిత్ర యూనిట్ ఈ సారైనా చెప్పిన టైమ్ కి వస్తారా అంటే డౌటే అనొచ్చు.

ఎందుకంటే జూన్30న “స్పై” సినిమా తో పాటు, స్కైఫై జోనర్లో వస్తున్న 7:11PM కూడా అదే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఇవి రెండే గాక మరో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా వస్తున్నాయి. అసలే తమ రీసెంట్ చిత్రాల ప్లాప్ ల వల్ల నష్టాలతో మునిగిపోయిన చిత్ర నిర్మాతలు ఈ సినిమాను అనుకున్న టైమ్ కి ఈ సినిమాలకు పోటీగా రిలీజ్ చేస్తారన్నది గ్యారెంటీ లేదు. కాబట్టి చిత్ర నిర్మాతలు మళ్ళీ ప్రమోషన్లు మొదలు పెట్టి ట్రైలర్ రిలీజ్ తో కన్ఫర్మేషన్ ఇచ్చేవరకు వేచి చూడాలి. ఇక ఈ సినిమా లో రెబా మోనికా జాన్ అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందించారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు