Roja: మూవీస్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న రోజా.. ఇకనుంచి సీన్ రివర్స్..!

Roja re-entry in movies : ఒకప్పటి హీరోయిన్ రోజా మనందరికీ సుపరిచితమే. ఒకానొక సమయంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది రోజా. ఇక అనంతరం జబర్దస్త్ అనే కామెడీ షో కి జడ్జ్ గా వ్యవహరించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. ప్రజెంట్ అయితే ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ వుసే వినిపించడం లేదు.

కానీ పాలిటిక్స్ లో మాత్రం ఓ రేంజ్ లో వినిపిస్తుంది. వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గా రోజా నిలబడింది. అంతేకాకుండా తన ఆపోజిట్ పార్టీపై వరుస వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో డైమండ్ రాణిగా పేరు సంపాదించుకుంది. ఒకానొక సమయంలో రోజా ఎంత గుర్తింపును సంపాదించుకుందో ప్రెసెంట్ పాలిటిక్స్ ద్వారా ఆ పేరును మొత్తం మంట కలిపేసింది.

roja-is-making-a-re-entry-into-movies-scene-reverse-from-now-on
roja-is-making-a-re-entry-into-movies-scene-reverse-from-now-on

ఇక ఇదిలా ఉంటే తాజాగా రోజాపై ఓ వార్త వైరల్ అవుతుంది. రోజా మరోసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి ఏ సినిమాతో అనేది తెలియక పోయినప్పటికీ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ప్రజెంట్ రోజా కి వచ్చే అవకాశాలు అమ్మ, అత్త వంటి పాత్రలే వస్తాయి. అవి కూడా ఈమెకి వస్తాయో రావో కూడా తెలియదు. ఎందుకంటే ఈమెపై నెగటివిటీ అలా ఉంది మరి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు