Shankar : రెండు ఒకేసారి..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC 15 మూవీ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేడ్ వస్తుందేమో అని మెగా అభిమానులు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. RRR తర్వాత రామ్ చరణ్ చేస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. కాగా, ఇందులో రామ్ చరణ్ కు జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. అయితే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు.

దాంతో ‘అధికారి’, ‘సర్కారోడు’ వంటి టైటిల్స్ తెరపైకొచ్చాయి. కానీ తాజాగా ఈ సినిమా టైటిల్స్ రేసులో మరో కొత్త టైటిల్ వచ్చి చేరింది. ఇటు మాస్, అటు క్లాస్ ఆడియన్స్ కి నచ్చేలా ఈ చిత్రానికి ‘సీఎం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా భారీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ను స్వయంగా డైరెక్టర్ శంకర్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అందించారు.

ప్రస్తుతం తాను కమల్ హాసన్ తో ఇండియన్ 2, రామ్ చరణ్ తో RC 15 చేస్తున్నట్లు తెలిపాడు. రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకుంటాయని ట్విట్టర్ వేదికగా శంకర్ తెలిపాడు. RC 15 మూవీ తర్వాతి షెడ్యూల్ సెప్టెంబర్ మొదటి వారంలో ఉంటుందని వెల్లడించారు. హైదరాబాద్, వైజాగ్ లలో షూటింగ్ జరుపుకుంటుందని ప్రకటించారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు