ROCKETRY : నంబికి అంత సీన్ లేదు

కొన్ని రోజుల క్రితం ‘రాకెట్రి : ది నంబి ఎఫెక్ట్’ అనే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడులైంది. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ వచ్చింది. కోలీవుడ్ హీరో మాధవన్ కీలక పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం కూడా వహించాడు. అలాగే నిర్మాణ బాధ్యతలనూ చూసుకున్నాడు. భారీ అంచనాలతో ఈ సినిమా థియేటర్ లలో విడుదలైంది. కానీ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. దీంతో కొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చి చేరింది.

ఈ సినిమాలో నంబినారాయణన్ చేయని తప్పుకు దేశ ద్రోహం కేసులో అరస్టు అయ్యాడని చూపించారు. నంబి ఒక గొప్ప శాస్త్రవేత్త అని, మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాంకే పలు సూచనలు చేశాడు అన్నట్టు చూపించారు. ప్రేక్షకులు కూడా దీన్ని నిజమే అని భావించారు. కానీ, ఈ సినిమాలో నంబి పాత్ర గురించి చెప్పింది మొత్తం అబద్ధమే అని అంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.

డైరెక్టర్ ఎల్పీఈ ఇస్రో క్రియోజెనిక్ ముత్తునాయగం, ఇంజిన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఈవీఎస్ నంబూతిరి క్రియోజెనిక్ ఇంజిన్ డిప్యూటీ డైరెక్టర్ డి. శశికుమారన్ తో పాటు పలువురు శాస్త్రవేత్తలు మీడియా సమావేశం నిర్వహించి రాకెట్రి : ది నంబి ఎఫెక్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాతో ఇస్రో శాస్త్రవేత్తల పరువు తీశారని వీళ్లు మండిపడ్డారు. ఇస్రోలో ఉన్న పలు ప్రాజెక్ట్ లకు నంబి నారాయణన్ పితామహడినని సినిమాలో ఉందని అన్నారు. దీనిలో ఎలాంటి నిజం లేదని తెల్చి చెప్పారు. ఒక సందర్భంలో మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాంకు నంబి సూచనలు చేసినట్టు ఉందని, ఇది పూర్తిగా అవాస్తవని అన్నారు

- Advertisement -

నంబి అరెస్ట్ తర్వాత క్రయోజెనిక్ టెక్నాలజీని కొనుగోలు విషయంలో జాప్యం జరిగిందని సినిమాలో చూపించారు అది కూడా అబద్ధమే అని చెప్పుకొచ్చారు. ఇస్రో క్రియోజెనిక్ టెక్నాలజీని 1980లో అభివృద్ధి చేయడం ప్రారంభించిందని గుర్తుచేశారు. అ సమయంలో నంబూతిరి నే ఇన్ చార్జ్ గా ఉన్నారని వివరించారు. అసలు ఈ ప్రాజెక్ట్ తో నంబికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సినిమాలో ఇన్ని అసత్యాలు చూపించారని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

ఇదిలా ఉండగా.. శాస్త్రవేత్తల మీడియా సమావేశంపై మాధవన్, నంబి, రాకెట్రి : ది నంబి ఎఫెక్ట్ టీం ఎలా స్పందిస్తుందో అనే ఉత్కంఠ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు