Raviteja : ఇంకా నమ్ముతున్నాడా ?

రవితేజ ‘క్రాక్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. అంతకు ముందు రవితేజ నటించిన సినిమాలు వరుసగా నిరాశపరిచాయి. అయితే ‘క్రాక్’ రిజల్ట్ వల్ల రవితేజ పై దర్శకనిర్మాతలకు నమ్మకం ఏర్పడింది. అడిగినంత పారితోషికం ఇచ్చి సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఈ ఏడాది రమేష్ వర్మ- రవితేజ కాంబినేషన్లో వచ్చిన ‘ఖిలాడి’ చిత్రం ప్లాప్ అయ్యింది.గతంలో రవితేజ- రమేష్ వర్మ కాంబినేషన్లో ‘వీర’ అనే ప్లాప్ చిత్రం కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఖిలాడి’ చిత్రానికి రవితేజ మార్కెట్ కు మించి బడ్జెట్ పెట్టించాడు రమేష్ వర్మ. ఈ విషయం పై రవితేజ, ‘ఖిలాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బహిరంగంగానే సెటైర్లు వేశాడు. ఆ సినిమా హిట్ అయితే టెక్నికల్ టీం కి మాత్రమే క్రెడిట్ దక్కుతుంది అంటూ రమేష్ వర్మని తక్కువ చేసి మాట్లాడాడు.

అన్ని మాటలు అని ఇప్పుడు మళ్ళీ రమేష్ వర్మ వద్దకే వెళ్తున్నాడు రవితేజ. విషయం ఏంటి అంటే, రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ ను హీరోగా లాంచ్ చేసే బాధ్యత రవితేజ తీసుకున్నాడు. ఓ కథను కూడా లాక్ చేశాడు. అయితే దర్శకుడు రమేష్ వర్మకు ఈ చిత్రానికి సంబంధించి స్క్రీన్ ప్లే, మాటలు అందించే బాధ్యత అప్పగించాడని సమాచారం. డైరెక్షన్ మాత్రం ఓ కొత్త కుర్రాడు చేయబోతున్నాడట. డైరెక్టర్ వేరైనా, తనకు రెండు ప్లాప్ లు ఇచ్చిన తర్వాత కూడా రమేష్ వర్మని రవితేజ ఎలా నమ్ముతున్నాడు అనేది ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు