Kaduva Teaser : మాస్ ఆడియన్స్ కు కిక్ !

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ‘శివపురం’ ‘పోలీస్ పోలీస్’ వంటి టైటిల్స్ తో తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘భీమ్లా నాయక్’ సినిమా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన మలయాళ చిత్రం ‘అయ్యపనుమ్ కోషియమ్’ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రం కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ‘లూసిఫర్’ కు రీమేక్. పృథ్వీరాజ్ సినిమాలు ఓటీటీలో రావడంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

పృథ్వీరాజ్ లేటెస్ట్ మూవీ ‘కడువా’ తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. ‘కడువా’ అంటే పులి అని అర్థం వస్తుంది. షాజీ కైలాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.మలయాళంలో మాస్ చిత్రాలకు ఆయన స్పెషలిస్ట్. ‘మ్యాజిక్ ఫ్రేమ్స్’, ‘పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్’ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియ మీనన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘భీమ్లా నాయక్’ లో రానా భార్యగా నటించిన సంయుక్త మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా వివేక్ ఒబెరాయ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. జూన్ 30న మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్రం టీజర్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు.

టీజర్ మొత్తం మాస్ ఎలిమెంట్స్ తో నిండి ఉంది. ‘ఆయనొక చిరుత .. వేట కోసం కాచుకున్న చిరుత’ అనే డైలాగ్ మాస్ ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయిపోతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ వైట్ అండ్ వైట్ లో ఇచ్చిన ఎంట్రీ, యాక్షన్ సన్నివేశాల్లో చూపించిన యాటిట్యూడ్, స్వాగ్ లాంటివి భాషతో సంబంధం లేకుండా ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. ఇక పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ గా వివేక్ ఒబెరాయ్‌ కనిపించబోతున్నాడు. కథకు సంబంధించిన లీడ్ ఏమీ ఇవ్వలేదు కానీ టీజర్ మాత్రం మాస్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు