Prithviraj Sukumaran : మెగా ఆఫర్ ను వదులుకున్నాడట !

మెగాస్టార్ చిరంజీవి అంత ఈజీగా ఏ దర్శకుడితోనూ సినిమా చేయడానికి ఒప్పుకోరు. 150వ సినిమా కోసం ఎంత మంది దర్శకులతో స్టోరీ సిట్టింగ్ లు వేశారో అందరికీ తెలిసిందే. చివరికి వినాయక్ ను ఫైనల్ చేశారు. అలాగే ‘లూసిఫర్’ రీమేక్ అయిన ‘గాడ్ ఫాదర్’ కు కూడా చాలామంది దర్శకులను సంప్రదించారు. అందులో సుజీత్, వినాయక్ వంటి వారు కూడా ఉన్నారు. చివరికి మోహన్ రాజా ఎంపికయ్యాడు. అయితే ఈ చిత్రానికి ఒరిజినల్ ను తెరకెక్కించిన పృథ్వీరాజ్ నే డైరెక్షన్ చేయమని చిరు కోరారట. కానీ, పృథ్వీ రాజ్ ఆ ఛాన్స్ ను వద్దనుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పృథ్వీ రాజ్ రివీల్ చేశారు.

‘మెగాస్టార్ చిరంజీవి గారు ‘లూసిఫర్’ చిత్రం రీమేక్లో నటించడం ఆనందంగా ఉంది. ఆయన ఇమేజ్ కి సరిపోయే కథ ఇది. తెలుగులో కూడా నన్ను డైరెక్ట్ చేయమని అడిగారు. కానీ నాకు కుదరలేదు. అంతకుముందు ‘సైరా నరసింహ రెడ్డి’ లో కూడా ఓ మంచి పాత్ర ఉంది చేయమని అడిగారు. అప్పుడు కూడా నేను వేరే షూటింగ్ లో బిజీగా ఉండటం వలన చేయలేకపోయా. అయితే ‘లూసిఫర్ 2′ కూడా తెరకెక్కిస్తాను. ఆ కథ కనుక చిరంజీవి గారికి నచ్చి రీమేక్ చేస్తాను అంటే నేనే దర్శకత్వం వహిస్తాను’ అంటూ పృథ్వీరాజ్ సుకుమారన్ తన ‘కడువా’ టీజర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు. మొత్తానికి మెగా ఆఫర్ ను పృథ్వీరాజ్ సుకుమారన్ రెండు సార్లు రిజెక్ట్ చేశాడన్నమాట

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు