Pakka Commercial : మాస్ మహారాజ్ ‘పక్కా’ మిస్ ?

గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే చిత్రం రూపొందింది. జూలై 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అందుకుంటుంది అని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, చిత్ర శుక్లా కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘జి ఎ 2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్ బిజోయ్ సంగీత దర్శకుడు కావడం విశేషం. ఈ చిత్రంలో గోపీచంద్ అవినీతి లాయర్ గా కనిపించబోతున్నారు. మ్యాచో స్టార్ లుక్స్ ఆకట్టుకుంటున్ానయి. ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్స్, టీజర్ మాస్ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించే విధంగా ఉన్నాయి.

ఇదిలా ఉండగా, ‘పక్కా కమర్షియల్’ కథను మొదట గోపీచంద్ కోసం అనుకోలేదట. ముందుగా మారుతి వేరే హీరోతో ఈ కథని చేయాలనుకున్నారు అని ఇండస్ట్రీ టాక్. ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజ్ రవితేజ. మొదట ఈ కథని రవితేజకు వినిపించారట మారుతి. కానీ రవితేజ వరుసగా సినిమాలకు కమిట్ అయి ఉండటంతో ఈ ఆఫర్ ను తిరస్కరించినట్టు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు