Ram : ‘నేను ఏ అమ్మాయిని ఇష్టపడ్డాను రా బాబు’

ఎనర్జిటిక్ స్టార్ రామ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ వార్త గత 3 రోజులుగా తెగ వైరల్ అవుతుంది. రామ్ కు కూడా పెళ్లి వయసు వచ్చింది. టాలీవుడ్ లో పెళ్లికి రెడీగా ఉన్న యంగ్ హీరోల్లో రామ్ ఒక్కడు. దీంతో ఈ వార్తను చాలా మంది నమ్మేశారు. తన స్కూల్ మేట్ ను రామ్ ప్రేమించాడని, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నాడు అనేది ఆ వార్తల సారాంశం. ఈ విషయం పై రామ్ స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ‘దేవుడా ఇక ఆపండి. విషయం ఇంకా పెద్దదయ్యేలా ఉంది. నేను స్కూల్ కి సరిగ్గా వెళ్ళేవాడిని కాదు. ఈ విషయం పై మా ఇంట్లో కూడా అడుగుతున్నారు. నా ఫ్రెండ్స్ కు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు ఎలాంటి హైస్కూల్ స్వీట్ హార్ట్ లేదు’ అని స్పష్టం చేశారు.

దీంతో ఈ వార్తలకు బ్రేక్ లు పడ్డాయి. కానీ, వయసు వచ్చినా, పెళ్లి పీటలు ఎక్కువా అనే ప్రశ్నలు మాత్రం తక్కువ కాలేదు.

ఇక సినిమాల విషయానికి వస్తే, రామ్ – లింగుస్వామి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ది వారియర్’ చిత్రం జూలై 14న తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ కాబోతుంది. ఇది ద్విభాషా చిత్రం అన్న సంగతి తెలిసిందే. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ మాస్ మసాలా ఎంటర్టైనర్ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు