NBK107 : బాలయ్య డబుల్ డోస్ ?

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మాణంలో తెరకెక్కుతుంది. NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బ్లాక్ డ్రెస్ లో బాలయ్య ఊర మాస్ గా కనిపించి ప్రేక్షకులను అలరించారు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మాస్ ఆడియన్స్ కు కావాల్సిన యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ టీజర్ బాలయ్య అభిమానులకు ఫుల్ ఫీస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి. ఇదిలా ఉండగా, ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ చిత్రంలో కూడా బాలయ్య డబుల్ రోల్ చేస్తున్నట్టు వినికిడి. ఫస్ట్ హాఫ్ లో రెండు లోకల్ ఫైట్లు, ఒక ఫారెన్ ఫైట్ ఉంటుందట. ఇంటర్వెల్ బ్యాంగ్ పూనకాలు తెప్పించే విధంగా ఉంటుంది అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తుండు. దునియా విజయ్ విలన్ గా కనిపించబోతున్నాడు. మొదట ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలని అనుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు ‘అఖండ’ లానే డిసెంబర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు