Rathika Rose: రతిక అలాంటి పని.. షాక్ లో ఫ్యాన్స్..!

Rathika Rose.. ప్రముఖ బిగ్ బాస్ బ్యూటీ రతిక రోజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఒకప్పుడు సినిమాలలో కూడా నటించిన ఈమె బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాతే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.. ఇందులో డిఫరెంట్ షేడ్స్ చూపించడంతోపాటు తన అందాలతో కుర్రాలను కూడా మైమరిపించింది.. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ తో సన్నిహితంగా ఉంటూనే అతనితో గొడవలు పడి రివర్స్ అయ్యింది.. ఈ క్రమంలోనే ఎన్నో ట్రోల్స్ కూడా ఎదుర్కొంది.. రతిక కొద్ది రోజులకే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఈమె మళ్లీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇచ్చి అందరిని కన్ఫ్యూజ్ చేసింది.. కనీసం అప్పుడైనా ఆటతో మెప్పిస్తుందా అంటే అప్పుడు కూడా పులిహోర కలుపుతూ టైం పాస్ చేసింది.

వీడియో తో షాక్..

Rathika Rose: Such work on the fields... Fans in shock..!
Rathika Rose: Such work on the fields… Fans in shock..!

ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లో అడుగుపెట్టినప్పటికీ 12వ వారంలోనే ఎలిమినేట్ అయ్యి ఇంటి నుండి బయటకు వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ సినిమాలలో కీలకపాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరించడమే కాదు బుల్లితెరపై కూడా పలు షో లు చేస్తూ ఆకట్టుకుంటుంది.. ఇక అంతే కాదు సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలతో యువతకు చుక్కలు చూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ముఖ్యంగా ఈమె అందాలకు వేడెక్కిపోతున్నారు యువత.. ఇదిలా ఉండగా తాజాగా రతిక రోజ్ ఒక షాకింగ్ వీడియో అని తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. అందులో చీర కట్టి , రెండు జడలు వేసి సైకిల్ పై కూర్చుని బీడీ తాగుతూ కనిపించింది.. ముఖ్యంగా పుష్ప -2 సినిమాలోని రెండవ పాట చూసేకి అగ్గిపుల్ల అనే పాటకు రీల్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఈ వీడియోని చూసిన చాలా మంది సూపర్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఇలాంటి వీడియోలతో సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తోంది ఈ బిగ్ బాస్ బ్యూటీ..

రతిక కెరియర్..

రతిక కెరియర్ విషయానికి వస్తే.. పటాస్ షో ద్వారా స్టాండప్ కమెడియన్ గా చేసిన రతిక ఇంస్టాగ్రామ్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా లక్షన్నరకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈమె తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. రతిక రోజ్ నేను స్టూడెంట్ సార్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.. బిగ్బాస్ షో తన జాతకాన్ని మారుస్తుందని ఆమె భావించింది.. అందుకు తగ్గట్టుగానే ఆమె జీవితం కూడా ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుందని చెప్పవచ్చు. ఏపీలో పుట్టి పెరిగిన రతిక బీటెక్ పూర్తి చేసింది. ఆర్థికంగా స్థిరపడ్డ కుటుంబానికి చెందిన రతిక బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది సినిమాలో హీరోయిన్గా చేశారు. ముఖ్యంగా స్టార్ హీరోలు సినిమాలలో ఛాన్స్ వస్తే మాత్రం ఈమె కెరియర్ మరో లెవెల్ లో ఉండే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. ఏదేమైనా రతిక కెరియర్ ను బిగ్ బాస్ మార్చేసింది అనడంలో సందేహం లేదు.

 

View this post on Instagram

 

A post shared by Rathika Ravinder (@rathikaravinder)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు