Fahadh Faasil’s upcoming Movies : ఫహద్ సాలిడ్ లైనప్… ఏడు సినిమాలు లైన్లో…

Fahadh Faasil’s upcoming Movies : భారతీయ చలనచిత్ర పరిశ్రమంలోని మల్టీ టాలెంటెడ్ హీరోలలో ఫహద్ ఫాజిల్ ముందు వరుసలో ఉంటారు. అల్లు అర్జున్ పుష్ప : ది రైజ్ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ అయినా, లేదా ఆవేశంలోని మరో నెగిటివ్ షేడ్ ఉన్న రంగా పాత్ర అయినా ఆయన నటన అసాధారణమని చెప్పొచ్చు. పాత్ర ఏదైనా అందులో జీవించేస్తాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాహద్ కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కాగా ఇప్పుడు ఫహద్ కెరీర్ పీక్స్ లో ఉండగా, ఆయన కిట్టిలో దాదాపు 7 క్రేజీ సినిమాలు ఉన్నాయి. మరి ఆ మూవీస్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Pic: Fahad Faasil's swag is unmissable in first look from Allu Arjun's 'Pushpa  2' - India Today

1. పుష్ప 2 : ది రూల్

ఫహద్ అప్ కమింగ్ సినిమాల గురించి మాట్లాడుకుంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ అయిన పుష్ప 2 గురించే. ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, ఫహద్ దుర్మార్గుడైన విలన్ షెకావత్ అనే ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. షెకావత్, పుష్ప రాజ్ మధ్య విభేదాలను మొదటి పార్ట్ లో చూసాము. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్ ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. మరి సెకండ్ పార్ట్ లో షెకావత్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -

Rajinikanth, Fahadh Faasil's picture from sets of Vettaiyan goes viral |  Tamil News - The Indian Express

2. వెట్టాయన్

సూపర్ స్టార్ రజినీకాంత్ తో వెట్టాయన్ అనే తమిళ సినిమాలో ఫహద్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో రజనీకాంత్, ఫహద్ తో పాటు అమితాబ్ బచ్చన్, రితికా సింగ్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, శర్వానంద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఫహద్ పూర్తిగా కొత్త క్యారెక్టర్ లో, కమెడియన్ గా కనిపించబోతున్నట్టుగా టాక్ నడుస్తోంది. 2024 అక్టోబర్లో ఈ మూవీ తెరపైకి రానుంది.

മാമന്നന്' ശേഷം വടിവേലുവും ഫഹദ് ഫാസിലും; 'മാരീശന്' ആരംഭം

3. మారేసన్

సుధీర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ లో వడివేలు, ఫహాద్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. వీరిద్దరూ గతంలో మామన్నన్ అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Fahadh Faasil Starrer Don't Trouble The Trouble, Oxygen Posters Out-  Republic World

4. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్

శశాంక్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఫాంటసీ డ్రామా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఎస్ఎస్ కార్తికేయ నిర్మాతగా మారబోతున్న మొదటి ప్రాజెక్టు ఇదే. ఇందులో ఫహాద్ హీరోగా నటిస్తున్నాడు.

5. ఆక్సిజన్

నాదేళ్ల సిద్ధార్థ దర్శకత్వం వహిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీలో ఫహాద్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఎస్ఎస్ కార్తికేయ నిర్మాతగా ఫహాద్ హీరోగా తెరకెక్కుతున్న రెండవ చిత్రం ఇది.

6. బౌగెన్‌విల్లా

ఫహద్ నెక్స్ట్ చిత్రాలలో బౌగెన్‌విల్లా ఒకటి. మలయాళంలో భారీ అంచనాలున్న ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, కుంచాకో బోబన్‌లు ఒకరితో ఒకరు తలపడబోతున్నారు. స్టైలిష్ యాక్షన్ చిత్రంగా రానున్న బౌగెన్‌విల్లా చిత్రంపై భారీ హైప్ ఉంది.

Fahadh Faasil's next title 'Karate Chandran' | - Times of India

7. కరాటే చంద్రన్

రాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా కరాటే చంద్రన్. ఇందులోనూ ఫహాద్ హీరోగా నటిస్తున్నారు. మొత్తానికి ఫహద్ పైప్ లైన్ లో ఇన్ని ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు