Nayanatara: ఆటో డ్రైవర్ తో గొడవ పడి ఏకంగా అపార్ట్మెంట్ నే ఖాళీ చేసిన నయన్?

Nayanatara : లేడి సూపర్ స్టార్ నయనతార అపార్ట్‌మెంట్‌లో నివసిస్తూ ఆటో డ్రైవర్‌తో, ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తితో గొడవ పడి, ఏకంగా ఆ గొడవ కారణంగా అపార్ట్మెంట్ నే ఖాళీ చేసిందట. అసలు విషయం ఏమిటంటే?

షాకింగ్ విషయాన్ని వెల్లడించిన నయన్

నయనతార కోలీవుడ్‌లో లేడీ సూపర్‌స్టార్‌. ఆమె, దర్శకుడు విఘ్నేష్ శివన్ సుమారు 7 సంవత్సరాలు ఒకరినొకరు ఘాడంగా ప్రేమించుకున్నారు. 2022లో ఈ లవ్ బర్డ్స్ వివాహం చేసుకుని, సంతోషంగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత విక్కీ-నయన్ దంపతులు కవల మగపిల్లలను సరోగసీ ద్వారా దత్తత తీసుకున్నారు. ఆ పిల్లలకు ఉయిర్అం, ఉలగ్ అని పేరు పెట్టారు.

బిడ్డ పుట్టిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్న నయనతార ఎంత బిజీగా ఉన్నా పిల్లలతో మాత్రం ప్రత్యేకంగా గడపడానికి టైమ్ తీసుకుంటుంది. ఇటీవల తమ పిల్లలను తీసుకుని చైనా పర్యటనకు వెళ్లిన నయనతార, విఘ్నేష్ శివన్ లు అక్కడే రెండో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో నయనతార అక్కడ జరిగిన గోడవల గురించి షాకింగ్ సమాచారాన్ని వెల్లడించారు.

- Advertisement -

నయన్ గొడవలు

నయన్ చెప్పినదాని ప్రకారం గతంలో నయనతార చెన్నైలోని ఎగ్మోర్ సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసించేది. ఆ సమయంలో అక్కడే ఉన్న గార్డెన్ లో ఆడుకోవడానికి తన కుమారులను కిందకు తీసుకువచ్చేదట. అలా ఒకసారి తన కవల పిల్లలిద్దరినీ అక్కడికి తీసుకెళ్లగా ఓ ఆటో డ్రైవర్ రైడ్ కోసం వచ్చాడట. చిన్నపిల్లలు ఆడుకునే ఏరియాలో ఇంత వేగంగా ఎందుకు వస్తున్నావంటూ నయనతార అతనితో గొడవకు దిగిందని తెలుస్తోంది.

Nayanthara, Vignesh Shivan celebrate their babies' 1st birthday with cute  posts - Hindustan Timesఅంతే కాకుండా మరోసారి ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి డెలివరీ ఇవ్వడానికి వచ్చి ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడడట. పిల్లల్ని డిస్టర్బ్‌ చేస్తూ ఎందుకు అంత పెద్దగా మాట్లాడుతున్నావ్‌ అని అడిగితే అతను తనతో గొడవ పడ్డాడని నయన్ చెప్పుకొచ్చింది.

అందుకే అపార్ట్మెంట్ ఖాళీ చేసిందా?

ఈ విషయం తెలుసుకున్న నయన్ పై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది మరీ ఓవర్ అంటూ కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నయన్ ఉందని ఆటో వాడు ఆటో నడపొద్దు, నయన్ పిల్లలు ఉన్నారు డెలివరీ బాయ్ ఫోన్లో మాట్లాడొద్దు అనడం దారుణం అంటున్నారు. అంతేకాకుండా అపార్ట్‌మెంట్‌లో తరచూ గొడవలు జరుగుతుండటంతో  నయనతార అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేసిందా అనే ప్రశ్న మొదలవుతోంది.

ఇప్పుడు నయన్ ఎక్కడ ఉంటోంది?

ఆ అపార్ట్మెంట్ ను ఖాళీ చేసిన నయన్ ఇప్పుడు చెన్నైలోని పోయిస్ గార్డెన్‌లో ఓ భారీ బంగ్లాను నిర్మించుకుని సెటిల్ అయ్యింది. అక్కడే తన భర్త, పిల్లలు ఇద్దరితో కలిసి సంతోషంగా జీవిస్తోంది. ఎప్పటికప్పుడు తాను పిల్లలతో, భర్త విగ్నేష్ తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుందన్న విషయం తెలిసిందే.

ఇక చివరిసారిగా జవాన్, అన్నపూర్ణి సినిమాలలో కనిపించిన నయన్ చేతిలో ఇప్పుడు రెండు మూడు సినిమాలు ఉన్నాయి. టెస్ట్, మన్నంగట్టి సినిమాలతో పాటే ఓ హిందీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు