Star Directors: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లక్కీ హీరోయిన్స్ వీళ్ళే..!

Star Directors.. సాధారణంగా ఎక్కడైనా సరే.. ప్రతి ఒక్కరి జీవితంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉంటారు.. వారిని కలిసినప్పుడు లేదా వారితో పని చేసినప్పుడు వారికి బాగా కలిసి వస్తుందని నమ్మేవారు కూడా ఉంటారు. అయితే ఇలాంటివి ఎక్కువగా మనకు సినిమా ఇండస్ట్రీలోనే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో కొంతమంది దర్శకులకు కొందరు హీరోయిన్స్ లక్కీగా మారిపోతూ ఉంటారు. ఎందుకంటే వారు తీసిన సినిమా సక్సెస్ కావడంతో వారు ఆ హీరోయిన్ తో కలిసి మరో సినిమాని కూడా తెరకెక్కిస్తారు.. అది కూడా మంచి విజయం సొంతం చేసుకుంటే.. ఆ దర్శకుడికి ఆ హీరోలు ఇక లక్కీ గర్ల్ అయిపోయినట్లే..

ఎందుకంటే చిత్ర పరిశ్రమలో విజయం అందుకోవడం కష్టం.. బడ్జెట్ ఎక్కువగా పెట్టి.. సినిమా సక్సెస్ అవుతుందని భావించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సందర్భాలు ఎన్నో.. అందుకే చాలా మంది తమ అదృష్టాన్ని నమ్ముకుంటారు.. మరి మన టాలీవుడ్ లో ఏ దర్శకుడికి.. ఏ హీరోయిన్.. లక్కీ హీరోయిన్ గా మారిందో ఇప్పుడు చూద్దాం..

రాజమౌళి:

- Advertisement -

దర్శక ధీరుడు రాజమౌళికి స్వీటీ అలియాస్ అనుష్క లక్కీ హీరోయిన్ అట.. ఎందుకంటే వీరి కాంబినేషన్లో వచ్చిన విక్రమార్కుడు, బాహుబలి, బాహుబలి 2 అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బాస్టర్ గా నిలిచి రికార్డులు సృష్టించాయి.

త్రివిక్రమ్:

త్రివిక్రమ్ కి ఇలియానా లక్కీ హీరోయిన్ వీరి కాంబినేషన్లో జులాయి, జల్సా చిత్రాలు వచ్చి హిట్ అందుకున్నాయి.. అంతేకాదు త్రివిక్రమ్ కి సమంతా కూడా లక్కీ హీరోయిన్.. వీరి కాంబినేషన్లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, అ,ఆ సినిమాలు కూడా మూడూ సూపర్ హిట్ గా నిలిచాయి.

శేఖర్ కమ్ముల:

Star Directors: These are the lucky heroines of Tollywood star directors..!
Star Directors: These are the lucky heroines of Tollywood star directors..!

సాయి పల్లవి డైరెక్టర్ శేఖర్ కమ్ములకు లక్కీ హీరోయిన్ అనే చెప్పాలి.. వీరి కాంబినేషన్లో ఫిదా చిత్రం రాగా.. ఇది సూపర్ హిట్గా నిలిచింది. అలాగే లవ్ స్టోరీ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది..

అజయ్ భూపతి:

Star Directors: These are the lucky heroines of Tollywood star directors..!
Star Directors: These are the lucky heroines of Tollywood star directors..!

ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతి కి ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా హీరోయిన్ పాయల్ లక్కీ హీరోయిన్గా మారింది.. అంతే కాదు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మంగళవారం సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

పూరీ జగన్నాథ్:

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి ఇడియట్ మూవీ హీరోయిన్ రక్షిత అంటే లక్కీ హీరోయిన్ అట. ఇక ప్రస్తుతం రక్షిత కన్నడ సినిమాలకే పరిమితమైంది.

అనిల్ రావిపూడి:

ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి కి మెహ్రిన్ లక్కీ హీరోయిన్.. ఎందుకంటే వీరి కాంబినేషన్లో రాజా ది గ్రేట్, ఎఫ్2, ఎఫ్3 సినిమాలు రాగా మూడు మంచి విజయాన్ని అందుకున్నాయి.

హరీష్ శంకర్:

Star Directors: These are the lucky heroines of Tollywood star directors..!
Star Directors: These are the lucky heroines of Tollywood star directors..!

ఈయనకు పూజా హెగ్డే లక్కీ హీరోయిన్ వీరి కాంబినేషన్లో డీజే , గద్దల కొండ గణేష్ వంటి సినిమాలు వచ్చి పర్వాలేదనిపించుకున్నాయి.

ఇలా ఈ హీరోయిన్స్ అంతా కూడా ఈ డైరెక్టర్లకి లక్కీ హీరోయిన్స్ గా మారిపోయారు.. ముఖ్యంగా వీరి కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం అది కచ్చితంగా హిట్ అవుతుందని.. అభిమానులు కూడా నమ్ముతూ ఉండడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు