Maniratnam : సిల్లీ రీజన్ తో మణిరత్నం మూవీనే రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్

Maniratnam : తమిళ దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో పని చేయాలని ఎంతోమంది స్టార్స్ ఉవ్విళ్లూరుతుంటారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం వచ్చిన అవకాశాన్ని కూడా వదిలేసుకుందట. అది కూడా సిల్లి రీజన్ తో. మరి మణిరత్నం మూవీనే రిజెక్ట్ చేసిన ఆ హీరోయిన్ ఎవరు? అనే విషయంలోకి వెళ్తే…

మణిరత్నం మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్

బాలీవుడ్ ఫ్యాషన్ స్టార్ సోనమ్ కపూర్ హిందీలో పలు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఆకట్టుకుంది. అయితే ఈ బ్యూటీ ఏకంగా మణిరత్నం ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన కడల్ అనే మూవీ 2013లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రముఖ తమిళ నటుడు కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ హీరోగా పరిచయమయ్యాడు. గౌతమ్ కార్తిక్ హీరోగా అర్జున్ సర్జా, అరవింద్ స్వామి, తులసి నాయర్, లక్ష్మీ మంచు కీలకపాత్రల్లో నటించిన ఈ మూవీ పర్వాలేదు అనిపించింది. ఈ మూవీకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

ఇక కడల్ మూవీలో గౌతమ్ కార్తీక్ సరసన తులసి హీరోయిన్ గా నటించగా, ఆమెకు కూడా తమిళంలో ఇదే మొదటి మూవీ. అయితే అప్పట్లో ముందుగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ను హీరోయిన్ గా అనుకున్నారట. మణిరత్నం టీం ఆమెను సంప్రదించగా, సోనమ్ కపూర్ తండ్రి అనిల్ కపూర్ కూడా ఆ పాత్రను చేయాలని కోరారట. కానీ సోనమ్ మాత్రం సిల్లీ రీజన్ తో ఆ మూవీ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట.

- Advertisement -

How Sonam Kapoor Ahuja's Instagram Feed Provides Us With Endless Fashion Inspiration

రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే

ఆ కారణం ఏంటంటే భాషతో ఇబ్బంది పడాల్సి వస్తుందన్న కారణంగా ఆమె మణిరత్నం సినిమాలో చేయడానికి వెనకడుగు వేసిందట. అయితే ఈ విషయం గురించి సోనమ్ కపూర్ ఎప్పుడు అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఒకానొక సందర్భంలో ఈ విషయం గురించి అడిగినప్పుడు మాత్రం మణి సార్ తో కలిసి పని చేయడం గురించి నేను కామెంట్ చేయడానికి ఇష్టపడను అంటూ సమాధానాన్ని దాట వేసింది. మొత్తానికి ఆమె మణిరత్నం సినిమాను రిజెక్ట్ చేసింది అన్న త్రోబ్యాక్ న్యూస్ మరోసారి వైరల్ అవుతోంది.

సోనమ్ కపూర్ ఏం చేస్తోంది?

2007లో సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన సావరియా చిత్రంతో సోనమ్ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. రణబీర్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. అలాగే సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత సోనమ్ ఢిల్లీ 6, రాంఝనా, భాగ్ మిల్కా భాగ్, ప్యాడ్‌మ్యాన్ మొదలైన అనేక సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. పాళీ సినిమాలలో మంచి నటిగా ప్రశంసలు అందుకుంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సోనమ్ కపూర్ ప్రస్తుతం భర్త ఆనంద్ ఆహుజా, కొడుకు వాయుతో పర్సనల్ లైఫ్ గడుపుతోంది. మరి మళ్లీ ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందా? అంటే ఇంకా సమాధానం తెలియదనే చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు