Ram : తమిళ మార్కెట్ పై ఫోకస్ ?

ఎనర్జిటిక్ స్టార్ రామ్, ‘హలో గురు ప్రేమ కోసమే’ ‘ఇస్మార్ట్ శంకర్’ ‘రెడ్’ లాంటి వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామితో ది వారియర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతుంది. జూలై 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత రామ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇది ఇంకా సెట్స్ పైకి కూడా వెళ్ళలేదు. కానీ, అప్పుడు రామ్ తర్వాత చేయాల్సిన సినిమాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా రామ్ చూపంతా తమిళ దర్శకుల పైనే ఉంది అని వినికిడి.

బాలీవుడ్ ప్రేక్షకులు ప్రస్తుతం తెలుగు సినిమాల వైపే చేస్తున్నారు. కాబట్టి హిందీ మార్కెట్ పై డౌట్ పడనవసరం లేదు. కాకపోతే తమిళంలో మాత్రం ఏ హీరో కూడా నిలదొక్కుకోలేకపోతున్నాడు. రాజమౌళి తర్వాత అక్కడ మన టాలీవుడ్ సినిమా ఏదైనా బ్రేక్ ఈవెన్ అయ్యిందా అంటే అది ఒక ‘పుష్ప’ అనే చెప్పాలి. అల్లు అర్జున్ ను కోలీవుడ్ ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకున్నారు. అల్లు అర్జున్ స్థాయిలో రాణించాలి అని రామ్ కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో మురుగదాస్, గౌతమ్ మీనన్ వంటి మూలన పడి ఉన్న అక్కడి స్టార్ దర్శకులను రామ్ టీం సంప్రదిస్తున్నట్టు వినికిడి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు