Rama Rao on Duty : ‘రామారావు’ ఆ పాటలేంటయ్యా?

రవితేజ నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక టీజర్, రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. కానీ ఇవేమి సినిమాపై హైప్ ను క్రియేట్ చేయలేకపోయాయి. ఓ పక్క బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఆ కారణంతోనే జూన్ 17న విడుదల కావాల్సిన ఈ మూవీ జూలై 29కి వాయిదా పడిందని వినికిడి. కానీ, నిర్మాతలు మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా అని చెప్పి డైవర్ట్ చేశారట. ఏ సినిమాపై అయినా, హైప్ పెరగాలంటే ముందుగా పాటలు ఇంప్రెసివ్ గా ఉండాలి.

ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీత దర్శకుడు. ‘నోటా’ ‘అర్జున్ సురవరం’ ‘మోసగాళ్ళు’ లాంటి చిత్రాలకు సంగీతం అందించాడు. అయితే ‘ఖైదీ’ ఔట్పుట్ చూసే తెలుగులో సామ్ సి ఎస్ కు అవకాశాలు దక్కుతున్నాయి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ కి కూడా అలాగే ఎంపికయ్యాడు. అయితే ఇప్పటివరకు ఆ చిత్రం నుండి రిలీజ్ అయిన ‘బుల్ బుల్ తరంగ్’ కానీ ‘సొట్ట బుగ్గల్లో’ పాట కానీ అస్సలు జనాల్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ చిత్రం నుండి ఓ ఐటెం సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. ‘నా పేరు సీసా’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. వినడానికి ఈ పాట లిరిక్స్ ఏమాత్రం వినసొంపుగా లేవు. పైగా జనాలకి మరో ‘పుచ్చకాయ’ లిరిక్స్ ను తలపిస్తున్నాయి. తమిళ దర్శకులకు అవకాశాలు ఇస్తే తెలుగు నేటివిటీ మిస్ అవుతుంది అనడానికి ఈ సినిమా కూడా ఓ ఉదాహరణగా మారేలా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు