Chiru-Balayya : వాటిని ఇగ్నోర్ చేయాల్సిందేనా ?

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరు నెంబర్ వన్ హీరోలుగా చలామణి అయినవారే. సుమన్ హవా తగ్గిన రోజుల్లో బాలయ్య కొన్ని రోజులు నెంబర్ ప్లేస్ లో కొనసాగాడు. ఈ క్రమంలో అనూహ్యంగా చిరంజీవి ఊపందుకున్నాడు. నెంబర్ వన్ ప్లేస్ ను సొంతం చేసుకున్నాడు. అప్పటి నుండి వీళ్ళ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ‘దెబ్బకు దెబ్బ’ అన్నట్టు తలబడేవి. వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆ రేంజ్ లోనే ఉండేది. ఇద్దరి సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ నమోదయ్యేవి. వీరిద్దరూ చూడని ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు లేవు. ఇప్పటికీ వీరి హవా కొనసాగుతుంది.
ఈ జనరేషన్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, ప్రభాస్, రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు కు చిరు, బాలయ్య ఇంకా పోటీ ఇస్తున్నారు.

అయితే ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఓ సందర్భంలో తమ ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తున్నారు. అది ఏంటంటే, చిరు ఈ మధ్య కాలంలో వరుసగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లకి గెస్ట్ గా వెళ్తున్నాడు. అక్కడ మైక్ పట్టుకుంటే 20 నుండి 30 నిమిషాల వరకు పెద్ద స్పీచ్ ఇస్తున్నారు. సినిమా వేడుకలు అన్న తర్వాత డబ్బా కొట్టడం మాములే. అయితే చిరు మాత్రం ఆ చిత్రాల్లో నటించే హీరోయిన్లతో, కాస్ట్ అండ్ క్రూ తో “నాతో ఎప్పుడు సినిమాలు చేస్తారు” అని అడుగుతున్నారు. ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ వేడుకలో సాయి పల్లవి తో కలిసి డ్యాన్స్ చేయాలని అన్నాడు. దీనికి ముందు తమన్నాతో కలిసి నటించాలని ఉంది అన్నాడు. ఓసారి బిగ్ బాస్ ఫినాలే కి వెళ్తే అక్కడ దివితో కలిసి నటించాలని ఉందని, అందుకు దర్శకుడిని అడిగానని కూడా చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.

డైరెక్టర్ లను సైతం తనతో సినిమా చేయాలని చిరు చెప్పడం. ఇవన్నీ చిరు స్థాయిని తగ్గించుకుని మాట్లాడుతున్నట్టు ఉందంటూ కొందరు అభిమానులు హర్ట్ అవుతున్నారు. ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ వేడుకలో అయితే త్రివిక్రమ్ తో దానయ్య నిర్మాణంలో సినిమా చేస్తున్నాను అని చెప్పాడు. కానీ త్రివిక్రమ్ మాత్రం చిరు సినిమా పై ఫోకస్ పెట్టింది లేదు. ఈ మాటల మాంత్రికుడు ఫోకస్ మొత్తం ఫోకస్ అంతా హారిక, సితార, ఫార్చున్ ఫోర్ పైనే ఉంది. ఇతర నిర్మాతలతో సినిమా చేసే ఉద్ధేశం త్రివిక్రమ్ లేనట్టు ఉంది. కానీ, చిరు – త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కాస్త, చిరు-వెంకీ కుడుముల ప్రాజెక్ట్ కా మారింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది.

- Advertisement -

ఇక బాలయ్య విషయానికి వస్తే, ఈ నందమూరి హీరో హోస్ట్ గా చేసిన ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ కు దర్శకులు ఎవరైనా గెస్ట్ లుగా వస్తే నాతో సినిమా ఎప్పుడు చేస్తున్నారు. అంటూ అడగడం మనం చూశాం. బాలయ్యకు ఉన్న ఇమేజ్ కు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూ కడుతారు. కానీ, బాలయ్య అలా షోలలో అడగటం, తనను తాను తక్కువ చేసుకున్నట్టు ఉందని నందమూరి ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

మొత్తంగా ఈ ఇద్దరు సీనియర్ హీరోలు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి తమ ఇమేజ్ ను కాపాడుకోవాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇలా చేయండం వల్ల ఎన్నో ఏళ్ల నుండి సంపాదించుకున్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇకనైనా, ఈ అగ్రహీరోలు మారుతారా? లేదా, మళ్లీ అలాగే తమ క్రేజ్ కు దెబ్బపడేలా వ్యవహారిస్తారా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు