‘అబు బాగ్దాద్ గజదొంగ’ మెగాస్టార్ చిరంజీవి చేయాల్సిన పాన్ ఇండియా మూవీ. 1997లో ఈ చిత్రాన్ని రూ.50 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియాతో పాటు హాలీవుడ్లో కూడా రూపొందించాలి అని ప్లాన్ చేశారు. సురేష్ కృష్ణ అప్పట్లో టాప్ డైరెక్టర్. చిరుకి ‘మాష్టర్’ లాంటి హిట్ అందించిన దర్శకుడు. అందుకే ధైర్యంగా ఈ బడా ప్రాజెక్టుకు ఎంపిక చేసుకున్నారు. సగం షూటింగ్ పూర్తవ్వగానే కొన్ని కాంట్రవర్సీ ల కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ చిత్రం లానే పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ పరిస్థితి కూడా అయిపోతుందా అనే గుస గుసలు ఇప్పుడు ఎక్కువయ్యాయి.
సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు అనేవి కామన్. అభిమానులకు ఇలాంటివి కొంచెం ఎక్కువే ఉంటాయి. విషయం ఏంటి అంటే, చిరు చేయాల్సిన ‘అబు బాగ్దాద్ గజదొంగ’ సినిమా ఎటువంటి ముహూర్తానికి స్టార్ట్ అయ్యిందో, ‘హరి హర వీర మల్లు’ సినిమా షూటింగ్ కూడా అలాంటి ముహూర్తానికే స్టార్ట్ అయ్యిందట. అందుకే ఈ మూవీ షూటింగ్ కూడా త్వరగా కంప్లీట్ అవ్వడం లేదు. అంటూ కొంతమంది జోస్యం చెబుతున్నారు. పవన్ కూడా హరిహర వీరమల్లులో గజదొంగ. దీంతో ఈ సెంటిమెంట్ కు మరింత బలం వస్తుంది. అయితే “హరిహర వీరమల్లు సినిమా ‘ఆగిపోలేదు. కచ్చితంగా ఉంటుంది. ఇది పవన్ మనసుకు చాలా దగ్గరైన మూవీ. తొందరపడి కాకుండా, సినిమా బాగా రావాలి అనే తపనతోనే పవన్ ఈ మూవీని తెరకెక్కుస్తున్నారు. అంటూ పవన్ సన్నిహితులు తెలియజేసారు. కాబట్టి పవన్ ఫ్యాన్స్ ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను పట్టించుకోవాల్సిన పనిలేదు.