Ram Charan: హిట్ – ప్లాప్ – రామ్ చరణ్

సిమెంట్ లేని గోడ – సెంటిమెంట్ లేని మనిషి నిలబడరు అంటారు.
ఇండస్ట్రీ లో కొన్ని కాంబినేషన్స్ , కొన్ని సెంటిమెంట్స్ ఉంటూనే ఉంటాయి. మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ టైంలోనే స్టార్డం అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
కానీ చరణ్ సినీ కెరియర్ లో ఒడిదుడుకులే ఎక్కువ ఉన్నాయ్.

2007 లో చిరుత సినిమా రిలీజ్ అయినప్పుడు.
చిరంజీవి అంత కాకపోయినా,డాన్స్ లు అవి బాగానే చేసాడు,మదర్ సెంటిమెంట్ వలన ఈ సినిమా ఆడేస్తుంది అన్నారు.
2009 లో మగధీర, ఈ సినిమా విషయంలో పెద్దగా కంప్లైంట్స్ ఏమి లేవు, కాంప్లిమెంట్స్ తప్ప.

2010 ఆరెంజ్,
ఎండాకాలం చెమట
వానాకాలం బురద
శీతాకాలం దోమల్లా
ఓటమి, విమర్శలు ఎప్పుడు ఒక విడదీయలేని ప్యాకేజి లా వస్తాయి.ఇక్కడ అదే జరిగింది.

- Advertisement -

2012 రచ్చ, సినిమా ఏమీలేదు ప్రతీ డైలాగ్ లో చిరంజీవిను ఇమిటేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు.తనకంటూ ఒక స్టైల్ లేదు అన్నారు.

2013 నాయక్ పరవాలేదు అనిపించింది.
తర్వాత జంజీర్/తుఫాన్ మళ్ళీ విమర్శల పర్వం.
ఆ తరువాత ఎవడు,గోవిందుడు అందరివాడేలే,బ్రూసిలి మంచి సినిమాలే కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి.

తరువాత ధ్రువ, ఎత్తిన నోళ్లు మూసుకోవడం మొదలయింది.
తరువాత రంగస్థలం, మూసిన నోళ్లపై ఆశ్చర్యంగా చేయి అడ్డుపెట్టడం మొదలయ్యింది. రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ లో రామరాజు ఆశ్చర్య పోవడం ప్రేక్షకుల వంతు అయింది.

కానీ రామ్ చరణ్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రతీ సారి ఆ వెంటనే ఓ ఫ్లాప్ వచ్చి కెరీర్ ని డౌన్ చేస్తుంది. ఇక శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమాపై మంచి బజ్ ఉంది. ఇప్పటి వరకు తీసిన షూట్ అవుట్ పుట్ బాగానే వచ్చిందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయితే , ఆ తరువాత గౌతమ్ తిన్ననూరి తో చెయ్యబోయే సినిమా మీద కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతాయి. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయితే చరణ్ తన సెంటిమెంట్ కి చెక్ పెట్టినట్లే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు