Rajashekar : అవకాశాన్ని రాజశేఖర్ మిస్ చేసుకుంటున్నారా?

రాజశేఖర్ ఒకానొక టైములో స్టార్ గా ఓ వెలుగు వెలిగిన వారే. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఘనత కూడా ఆయన సొంతం. ఇప్పటికీ హీరోగా చేస్తున్నారు. ఆయన నటించిన ‘శేఖర్’ అనే చిత్రం మే 20న విడుదల కాబోతుంది. లలిత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాల్సి ఉంది. కానీ జీవిత దర్శకత్వం వహించినట్టు ప్రమోట్ చేసుకుంటున్నారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేద్దాం.. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘జోసెఫ్’ అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది ‘శేఖర్’. జీవిత రాజశేఖర్ ల పెద్ద కుమార్తె శివాని కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషించింది. ఈ మూవీతో రాజశేఖర్ హిట్ అందుకుంటారు అని అంతా ఆశిస్తున్నారు.

ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. రాజశేఖర్ కు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బోలెడన్ని ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఆయన ఇంకా హీరోగా చేయాలనుకుంటున్నారు. ఓ మంచి హిట్ ఇచ్చాకే ఇవన్నీ చేస్తాను అని ఆయన చెబుతున్నారు. అయితే ఓ స్టార్ డైరెక్టర్ ‘రాజశేఖర్ అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఆయనకి ఉన్న క్రేజ్ తో ఇప్పుడు విలక్షణ నటుడిగా మారితే పాన్ ఇండియా స్టార్ అయిపోతారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ అన్ని భాషల్లోనూ బిజీ ఆర్టిస్ట్ అయిపోతారు. కానీ ఆయన మనసులో ఏముందో ఏమో’ అంటూ స్టార్ డైరెక్టర్ మనసులో ఉన్న మాటని బయటపెట్టాడు. నిజమే ఈ స్టార్ డైరెక్టర్ ఆల్రెడీ ఓ బ్లాక్ బస్టర్ సినిమా కోసం రాజశేఖర్ ను సంప్రదించారు. కానీ రాజశేఖర్ ఒప్పుకోలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు