స్టార్ డైరెక్టర్.. రవిరాజా పినిశెట్టి గారి అబ్బాయి ఆది పినిశెట్టి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. హీరోగా, విలన్ గా, సహాయ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఆది. తమిళ్లోనే కాదు తెలుగులో కూడా అది సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. మలుపు,శమంతకమణి, నిన్ను కోరి, సరైనోడు.. వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆది.
‘మలుపు’ ‘శమంతకమణి’ సినిమాల టైంలోనే హీరోయిన్ నిక్కీ గల్రానితో ఇతనికి పరిచయం ఏర్పడింది. చాలా కాలం నుండీ ప్రేమలో ఉన్న ఈ జంట మార్చి 27న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక ఈరోజు అంటే మే 18న పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నారు. హల్దీ ఫంక్షన్ కూడా గ్రాండ్ గా జరిగింది. టాలీవుడ్ నుండీ నాని,సందీప్ కిషన్ లు ఆది పెళ్లి వేడుకల్లో సందడి చేశారు.నానితో ‘నిన్ను కోరి’, సందీప్ కిషన్ తో ‘గుండెల్లో గోదారి’ వంటి చిత్రాల్లో కలిసి నటించాడు ఆది.
https://www.instagram.com/reel/CdqyKQYDNRC/?igshid=YmMyMTA2M2Y=