టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ ట్రెండ్ నడుస్తోంది.
స్టార్ హీరో సినిమాలను భారీ బడ్జెట్ తో రూపొందించడం.
దాన్ని కవర్ చేసుకోవడానికి టికెట్ల రేట్లను భారీ గా పెంచడం.
దానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సై అనడం.
ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు ఇదే జరుగుతుంది. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ తో పాటు కేజీఎఫ్-2 వంటి డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ల ప్రైజ్ ను భారీగానే పెంచారు. సామాన్య ప్రేక్షకుల గురించి పక్కన పెడితే, దీనివల్ల సినీ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు కాసుల వర్షం కురిసింది.
అయితే రీసెంట్ గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, ఎఫ్ 3 మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో వెంకటేష్ – తమన్నా, వరుణ్ తేజ్ – మెహ్రీన్ జంటగా నటిస్తున్నారు. కాగ ఈ మూవీ ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
ఈ మూవీ టికెట్ల ధరలను పెంచే అవకాశం ఉందని గత కొద్ది రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. కాగ దీనిపై ఓ వీడియోతో నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు ఉంటాయని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో టికెట్ల ధరలను పెంచబోమని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో సామాన్య ప్రేక్షకులను కూడా తమ వైపు తిప్పుకోవాలని దిల్ రాజ్ ప్లాన్ వేస్తున్నారు.
దిల్ రాజు నిర్ణయంపై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తుంది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ -2 సినిమాలకు ఫుల్ లాభాలు వచ్చే ఉంటాయని, ఈ సినిమానైనా తక్కువకు చూపించు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా దిల్ రాజు బిజినెస్ ట్రిక్క్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
' మే 27న, #F3Movie మీ అభిమాన థియేటర్లలో.. సాధారణ టికెట్ రేట్లతో '🤘🏻🤩
📽️ Let them know Raju Garu 🎟️
▶️ https://t.co/UCS0ElExcl#DilRaju @AnilRavipudi #Sunaina #F3OnMay27 🍿@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @SVC_official @adityamusic pic.twitter.com/H43dm8a7iB— Sri Venkateswara Creations (@SVC_official) May 18, 2022