Rakul Preet Singh : మెగా కోడల్ని ఫాలో అవుతున్న రకుల్..!

Rakul Preet Singh : సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన వారిలో రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒకరు.. చాలామంది సెలబ్రిటీలు కేవలం హీరోయిన్స్ గా కాకుండా పలు రకాల వ్యాపార రంగాలలో కూడా దూసుకుపోతూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తూ సక్సెస్ అయ్యారు.. ఈ క్రమంలోనే హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ కూడా పలు రకాల వ్యాపారాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే..

బిజినెస్ దిశగా అడుగులు..

ఇప్పుడు తాజాగా మళ్లీ ఒక బిజినెస్ ను మొదలు పెట్టబోతోందట.. ఇటీవలే బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమించి మరీ ఇటీవలే గ్రాండ్గా గోవాలో వివాహం చేసుకుంది.. ఇలా వివాహం జరిగిన తర్వాత కూడా రకుల్ ప్రీతిసింగ్ కెరియర్ పరంగా సక్సెస్ఫుల్ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు బాలీవుడ్ మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన విషయాలలోకి వెళితే సోషల్ మీడియా వేదికగా రకుల్ ప్రీతిసింగ్ ఒక విషయాన్ని తెలియజేసింది..

మెగా కోడలు బాటలో రకుల్ ప్రీత్ సింగ్..

రకుల్ ప్రీతిసింగ్ ఆమె “టేస్ట్ ప్లస్ హెల్తీ “అంటూ ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో తెలియజేసింది ఉగాది పండుగ నుంచి తన బిజినెస్ ను ప్రారంభం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలియజేసింది. ఇలా రకుల్ ప్రీతిసింగ్ టేస్ట్ ప్లస్ హెల్తీ అంటూ వీడియోని షేర్ చేయడంతో.. అభిమానులు సైతం రకుల్ ప్రీతిసింగ్ హెల్త్ టిప్స్ ఏమైనా చెబుతుందా లేకపోతే మెగా కోడలు ఉపాసన దారిలో వెళ్లి ఆమె కూడా ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ అందరికీ సప్లై చేసేలా సరికొత్త బిజినెస్ ని మొదలు పెడుతుందా అనే సందేహాలు కూడా మొదలవుతున్నాయి..

- Advertisement -

అయితే ఇప్పటికే ఉపాసన ఎక్కడికి వెళ్లినా సరే మన ఇంట్లో భోజనం తింటున్నామనే సంతృప్తి అందరికీ కలగాలనే ఉద్దేశంతోనే అత్తమ్మాస్ కిచెన్ అనే ఒక ఫుడ్ బిజినెస్ ని సైతం ప్రారంభించింది.. ఇప్పుడు తాజాగా రకుల్ ప్రీతిసింగ్ షేర్ చేసిన ఈ వీడియో చూస్తూ ఉంటే ఉపాసన బాటలోనే రకుల్ ప్రీతిసింగ్ కూడా ఫుడ్ బిజినెస్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది..

రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్..

రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ విషయానికి వస్తే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా “ప్రార్థన.. ప్రతీ రూపాయి కౌంటింగ్ ఇక్కడ” అనే డైలాగ్ తో భారీ పాపులారిటీ దక్కించుకుంది.. ఈ సినిమా తర్వాత పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈమె ఆ తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చి అక్కడే సెటిల్ అయిపోయింది.ఇటీవల కాలంలో రకుల్ ప్రీతిసింగ్ తెలుగులో ఏ సినిమాలో కూడా నటించలేదు.. కేవలం బాలీవుడ్ లోనే ఏడాదికి ఐదారు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.
మరి వివాహమైన తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందేమో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు