Prabhas: కల్కి గ్లిమ్స్ పై రాజమౌళి ఏమన్నారంటే ?

బాహుబలి సినిమాతో ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసిన రాజమౌళి, ప్రభాస్ లేటెస్ట్ గా చేస్తున్న అన్నీ సినిమాలపై ఏదో విధంగా స్పందిస్తూనే ఉంటారు. అంతేకాదు ఆ మధ్య ప్రభాస్ రిలీజైన ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాకైతే డార్లింగ్ అడిగాడని ఏకంగా వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు జక్కన్న. ఇక లేటెస్ట్ గా రిలీజైన ప్రభాస్ కల్కి 2898 AD సినిమాపై కూడా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసాడు.

వైజయంతి మూవీస్ బ్యానర్ ఫై భారీ బడ్జెట్ తో వస్తోన్న కల్కి 2898 AD గ్లిమ్స్ వీడియో రిలీజై, ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇండియాస్ మోస్ట్ యాన్టిస్పెటెడ్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఇటీవలనే కాలిఫోర్నియాలోని శాన్ డియాగో కామిక్-కాన్ వేదికపైన కల్కి 2898 AD గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేసారు.

ఫ్యూచరిస్టిక్ సినిమాగా ఈ సినిమాను మలిచారని గ్లిమ్స్ వీడియో ద్వారా అందరికి తెలిసిపోయింది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకునే, దిశాపటాని తదితరులు నటిస్తున్న ఈ సినిమా గ్లిమ్స్ వీడియోను చూసిన రాజమౌళి ఈ విధంగా స్పందించాడు.

- Advertisement -

“నాగి, వైజయంతి సినిమాస్ గ్రేట్ జాబ్. ఒక ప్రామాణికమైన ఫ్యూచరిస్టిక్ చిత్రాన్ని రూపొందించడం చాలా కష్టమైన పని మరియు మీరు దీన్ని సాధ్యం చేసారు..👏🏻👏🏻
డార్లింగ్ లుక్ అదిరిపోయింది..
ఒక్క ప్రశ్న మాత్రమే మిగిలి ఉంది…
విడుదల తేదీ ఎప్పుడు ? ”
అంటూ ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించగా ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ముందు నుంచి సినిమా రిలీజ్ వచ్చే ఏడాది సంక్రాంతికి అని అంటుండగా గ్లిమ్స్ వీడియోలో మాత్రం ఈ విషయాన్ని మెన్షన్ చేయకపోవడంతో సినిమా రిలీజ్ వాయిదా పడనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ఈ విషయంపై వైజయంతి మూవీస్ క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు