The Raja Saab: లుంగీ ఎత్తి అదరగొట్టేస్తున్న ప్రభాస్.. ఇక మాస్ జాతరే..!!

Raja Saab: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ఆ తర్వాత అన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలనే చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాని విడుదల చేయగా.. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.. ఇక మరొకవైపు కల్కి 2898AD చిత్రాన్ని విడుదలకు సిద్ధంగా ఉంచారు. ఇదిలా ఉండగా మరొకవైపు మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే .తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులు అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు.. నిన్న అర్ధరాత్రి ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ లీక్ అయిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకపోతే ఈ పోస్ట్ లో ప్రభాస్ చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తున్నారటంలో సందేహం లేదు. ఇక్కడ లుంగీ కట్టుకొని ఊరమాస్ లుక్ లో కనిపించిన ప్రభాస్ ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు..

Raja Saab: Prabhas raising his lungi and cheering.

- Advertisement -

గతంలో ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ని ఇలా చూసి తెగ సంబరపడిపోయిన ప్రభాస్ అభిమానులకి మళ్లీ ఇప్పుడు అదే లుక్ లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పడంలో సందేహం లేదు. హార్రర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని మేకర్స్ కూడా చెబుతున్నారు. మొత్తానికైతే ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు మారుతి.. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఇక ప్రభాస్ చిత్రాల విషయానికి వస్తే.. ఒకటి తర్వాత మరొకటి తెరకెక్కిస్తే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే కల్కి 2898 ఏడి చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరొకవైపు కన్నప్ప చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా అలాగే సలార్ 2 చిత్రంలో కూడా ఈయన నటించబోతున్నారు. మొత్తానికైతే రాజా సాబ్ నుంచి విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు