Puri Jagannath: బండ్ల కు, పూరి కౌంటర్ ?

ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘చోర్‌ బజార్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్లో బండ్ల గణేశ్‌ కామెంట్స్ ఎన్ని చర్చలకు దారితీసాయో తెలిసిందే కదా. ఆకాశ్‌ తండ్రి పూరి జగన్నాథ్‌ని అలాగే అతని డైరెక్షన్లో చేసిన హీరోలను ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. బండ్ల గణేశ్‌ కామెంట్స్ తో హర్ట్ అయిన కొంతమంది హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా అతని పై నెగిటివ్ కామెంట్స్ చేశారు. తాజాగా పూరి జగన్నాథ్‌ కూడా పరోక్షంగా బండ్ల గణేష్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు . తాను ఏం చెప్పాలి అనుకున్నా సరే పూరి మ్యూజింగ్స్ ద్వారానే చెబుతుంటాడు పూరి అన్న సంగతి అందరికీ తెలిసిందే.

పూరి మ్యూజింగ్స్‌ ద్వారా అతను మాట్లాడుతూ… ” గుర్తు పెట్టుకోండి మన నాలుక కదులుతున్నంతసేపు మనం ఏమి నేర్చుకోలేం. అందుకే జీవితంలో ఎక్కువ సేపు మనం వింటూ ఉండాలి. అదే మంచిది. ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కావొచ్చు, మీ ఫ్రెండ్స్ దగ్గర కావొచ్చు, ఆఫీస్ మెంబర్స్ దగ్గర కావొచ్చు, ఆఖరికి కట్టుకున్న భార్య దగ్గర కూడా ఆచితూచి మాట్లాడాలి. చీప్‌గా వాగొద్దు, చీప్‌గా ప్రవర్తించొద్దు. మన వాగుడు మన కెరీర్‌ను, క్రెడిబులిటీని డిసైడ్ చేస్తుంది. మీరు వినే ఉంటారు సుమతీ శతకం. ‘నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ’ అని.తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం మంచిది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇవి పరోక్షంగా పూరి బండ్ల గణేష్ పై మండిపడుతూ కామెంట్స్ చేసిన కామెంట్స్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు